Share News

వైసీపీ దుష్ప్రచారంపై కదం తొక్కిన టీచర్లు

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:34 PM

‘మీకు ఒక్క డీఎస్సీ నిర్వహించిన చరిత్ర లేదు.. ఐదేళ్ల పాటు మెగా డీఎస్సీ అంటూ కాలయాపన చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు.

వైసీపీ దుష్ప్రచారంపై కదం తొక్కిన టీచర్లు
సంఘీభావం తెలుపుతున్న ‘మెగా డీఎస్సీ-2025’ ఉపాధ్యాయులు

ఆత్మగౌరవం దెబ్బతీస్తే సహించం

మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం తగదు

అధికారంలో ఉండగా ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యాయ నియామకాలు చేసింది

ప్రశంసించాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేయడం సరికాదు

రాజకీయాల కోసం టీచర్లను బలిపశువులను చేయడం మాజీ సీఎం జగన్‌కు తగదు

పాఠమే కాదు.. గుణపాఠం చెప్పగలం

కూటమి ప్రభుత్వానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ

సీమ గురువుల ‘చలో కర్నూలు’ దిగ్విజయం

ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి తరలివచ్చిన టీచర్లు

కర్నూలు/ కర్నూలు ఎడ్యుకేషన్‌/ అర్బన్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ‘మీకు ఒక్క డీఎస్సీ నిర్వహించిన చరిత్ర లేదు.. ఐదేళ్ల పాటు మెగా డీఎస్సీ అంటూ కాలయాపన చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఫలితంగా గత ఎన్నికల్లో నిరుద్యోగులంతా ఏకమై నిన్ను గద్దె దింపారు. నాడు మేం కేవలం నిరుద్యోగులం మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు తరగతి గదిలో విద్యార్థులకు తీర్చిదిద్దేందుకు పాఠాలు చెప్పడం ఎంత బాగా వచ్చో.. అవాస్తవాలు, అబద్ధాలతో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే రాజకీయ నాయకులకు గుణపాఠాలు కూడా చెప్పడం అంతే బాగా తెలుసు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ అజ్ఞానాన్ని వీడి నిరుద్యోగుల కష్టాన్ని, ప్రతిభను గౌరవించడం నేర్చుకోవాలి.’ అంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేతపై మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు ధ్వజమెత్తారు.

కర్నూలులో గర్జించిన గురువులు

సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డీఎస్సీ-2025 ఫైలుపై తొలి సంతకం చేశారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పర్యవేక్షణలో ఎంతో పారదర్శకంగా కేవలం 150రోజులకు డీఎస్సీ-2025 పూర్తి చేసి మా జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపారు. ఏడాది తర్వాత ఇప్పుడొచ్చి డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం. మీ రాజకీయ స్వార్థం కోసం మమ్మల్ని రోడ్లపైకి లాగుతారా? నిరుద్యోగ యువతలో లేనిపోని అపోహలు సృష్టించి వారి జీవితాలతో ఆడుకుంటారా? అంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌, పార్టీ నాయకుల తీరుపై డీఎస్సీ-2025లో నియమించబడిన నూతన ఉపాధ్యాయ లోకం గర్జించింది. వైసీపీ దుష్ప్రచారంపై కదం తొక్కింది. మన మొగా డీఎస్సీ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధారమైన ఆరోపణలను ఖండిద్దాం! పశ్చిమ రాయలసీమ ఉమ్మడి జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన నూతన ఉపాధ్యాయులు శనివారం ‘చలో కర్నూలు’ కార్యక్రమంలో భాగంగా కొండారెడ్డి బురుజు వద్దకు వేలాదిగా తరలివచ్చారు. అక్కడి నుంచి జడ్పీ కార్యాలయం వరకు మెగా డీఎస్సీ-2025 సంఘీభావం.. ఆత్మగౌరవం ర్యాలీ నిర్వహించారు. పాఠాలు చెప్పే గురువులు.. ఆత్మగౌరవం కోసం తప్పుడు ప్రచారం ఖండిస్తూ.. ప్రతిపక్ష పార్టీ నాయకులపై సమరోత్సాహంతో చేసిన నినాదాలతో కర్నూలు నగర రహదారులు మార్మోగాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ, యువగళం పాదయాత్రలో యువనేత, ప్రస్తుత విద్య మంత్రి నారా లోకేశ్‌ ఇచ్చిన స్పష్టమైన హామీ అమలులో భాగంగా మెగా డీఎస్సీ-2025 నిర్వహించారు. పక్కా పకడ్బందీగా, ఎంతో పారదర్శకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి.. 2025 సెస్టెంబరు 25న అమరావతి నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగం వచ్చింది.. మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని నూతన గురువులు సంబరపడ్డారు. వారి సంతోషంపై నీళ్లు చల్లుతూ మాజీ సీఎం జగన్‌, వైసీపీ నాయకులు డీఎస్పీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచారానికి తెర తీశారు. ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదవి ఉద్యోగం సాధించిన గురువుల్లో సంతోషం లేకుండా చేయడం మొదలు పెట్టారు. వీరి ప్రచారాన్ని నమ్మిన కొందరు డీఎస్సీలో అక్రమాలు జరగడం వల్లే నీకు ఉద్యోగం వచ్చిందంట కదా.. టీచర్‌ ఉద్యోగాన్ని కొనుకున్నావంట కదా.. పలువురు ప్రశ్నించడంతో దుష్ప్రచారానికి తెర తీసిన వైసీపీ నాయకులపై ఉపాధ్యాయులకు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి.. తప్పుడు ప్రచారానికి బ్రేకులు వేయాలని నిర్ణయించుకున్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లో వైసీపీ చేస్తున్న నిరాధార ఆరోపణలపై టీచర్లలో చైతన్యాన్ని రగిలించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు వెంకట్రాముడు నాయక్‌, చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌, అనంతపురం జల్లాకు చెందిన రవికుమార్‌, ఎంఎస్‌ అక్రమ్‌బాషా ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ-2025- మెగా సంఘీభావ ర్యాలీ’కి పిలుపు ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ఆ పిలుపు అందుకున్న ఉపాధ్యాయులు శనివారం వెల్లువలా కర్నూలు కొండారెడ్డి బురుజుకు చేరుకున్నారు.

కొండారెడ్డి బుజురు నుంచి జిల్లా పరిషత్‌ వరకు మెగా ర్యాలీ

ఉదయం ఎనిమిది గంటలకే ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా.. గుంపులు గుంపులుగా కొండారెడ్డి బురుజు వద్ద ఓపెన్‌ థియేటర్‌ మైదానంలోకి చేరుకోవడం ప్రారంభించారు. 11.30 గంటలకు ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దాదాపు మూడు వేలకు పైగా గురువులు వచ్చారు. అందరూ ప్లకార్డులు చేతపట్టుకొని కొండారెడ్డి బురుజు ఎక్కి.. జగన్‌.. తప్పుడు ప్రచారం మానుకో..! మా ప్రతిభను అవమానించవద్దు..! ఎంతో పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేయకు..! మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే గుణపాఠం చెప్పడానికైనా మేము సిద్ధం..! అంటూ గర్జించారు. ఉపాధ్యాయులు మూక్కుమడి నినాదాలతో నగరం ఒక్కసారి ప్రతిధ్వనించింది. అక్కడి నుంచి ఒక క్రమశిక్షణగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగించకుండా శాంతియుత మార్గంలో సంఘీభావం, ఆత్మగౌరవ ర్యాలీ మొదలు పెట్టారు. నినాదాలు చేసుకుంటూ కోల్స్‌ కాలేజీ, కోట్ల సర్కిల్‌, కిడ్స్‌ వరల్డ్‌ సర్కిల్‌ మీదుగా జిల్లా పరిషత్‌ కార్యాలయం వరకు చేరుకున్నారు. దాదాపు గంటన్నరకుపైగా ర్యాలీ జరిగింది. టీచర్లపై రాజకీయం తగదంటూ హితువు పలికారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందకు సాగారు. తమ నియామకాలపై చేస్తున్న దుష్ప్రచారానికి తీవ్రంగా ఖండించారు. అనంతరం మహాత్మా గాంధీజీకి విగ్రహానికి వినతి పత్రం అంజేశారు. నూతన ఉపాధ్యాయులు చేపట్టిన ఈ సంఘీభావ ర్యాలీకి నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోషియేట్‌ ప్రధాన కార్యదర్శి శేషఫణి మద్దతు తెలిపారు. పిల్లలతో పాటు ఉపాధ్యాయినులు ర్యాలీ పాల్గొన్నారు. థ్యాంక్యూ సీఎం సర్‌, థ్యాంక్యూ లోకేశ్‌ సర్‌, థ్యాంక్యూ పవన్‌ కల్యాణ్‌ సర్‌ ప్లకార్డులతో సంఘీభావం.. కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశార

తప్పుడు ప్రచారంతో

మా ఆత్మగౌరవం దెబ్బతీయ వద్దు

డీఎస్సీ-2025 నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. రాజ్యాంగ బద్దంగా నిర్వహించారు. ప్రతిభ ద్వారానే మేమంతా ఉద్యోగాలు సంపాదించి పాఠాలు చెబుతున్నాం. ప్రతిపక్ష పార్టీలు అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచా రంతో ఆ ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. మా తల్లిదండ్రులను అవమానిస్తున్నారు. ఇకనైనా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలి.

ఇ.కృష్ణా, ఉపాధ్యాయుడు, డోన్‌

గురువుపై రాజకీయాలు మంచిది కాదు

ఏడాది పాటు కష్టపడి చదివితే టీచర్‌ ఉద్యోగం వచ్చింది. గత ప్రభుత్వం ఐదేళ్లు డీఎస్సీ పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీ-2025 నిర్వహించి మాలాంటి ఎందరో జీవితాల్లో వెలుగు నింపారు. ప్రతపక్ష పార్టీ నాయకులు తప్పుడు ప్రచారంతో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా యువతను మోసం చేస్తున్నారు.

- సూర్యప్రభావతి, బి.మఠం మండలం, కడప జిల్లా

దగా డీఎస్సీ అంటే సహించేది లేదు

పిల్లలకు, కుటుంబానికి దూరంగా ఉంటూ రాత్రిబంవళ్లు చదివి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటారా? ఇలా అంటే అంటే సహించేది లేదు. ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని మీకు డీఎస్సీ గురించి మీకేమి తెలుస్తుంది? డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ. మేమేమీ తప్పు చేశామయ్యా. సీబీఐ విచారణ కోరడానికి మాఆత్మగౌరవంతో ఆడుకుంటే యుద్ధానికి వస్తాం.

- తిరుపతమ్మ, ఉపాధ్యాయిని, అన్నమయ్య జిల్లా

యువతను తప్పుదోవ పట్టించొద్దు

డీఎస్సీ-25లో స్కూల్‌అసిస్టెంట్‌గా ఎంపికయ్యా. రెసిడెన్షియల్‌ పాఠశాలలో సీఆర్పీగా పనిచేశాను. 2018 డీఎస్సీలో టీజీటీగా ఎంపికయ్యాను. నాకు స్కూల్‌ అసిస్టెంట్‌ అవ్వాలని లక్ష్యం. 2025 డీఎస్సీ రాస్తే పోస్టు వచ్చింది. ఎంతో కష్టపడి చదివా. డీఎస్సీ-25లో అక్రమాలు జరిగాయని మాజీ సీ ఎం జగన్‌ ఆరోపించడం సరికాదు. పారదర్శకంగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరిగాయి.

రమాదేవి, ఉపాధ్యాయిని, కడప జిలా ్ల

Updated Date - Aug 08 , 2026 | 11:34 PM