Share News

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:01 PM

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.కరుణానిధి మూర్తి, జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ కృష్ణారెడ్డి, ధనుంజయ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.కరుణానిధి మూర్తి, జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ కృష్ణారెడ్డి, ధనుంజయ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పీఆర్‌టీయూ ఆధ్వ ర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయా లని అన్నారు. సర్వీసు, ఆర్థిక అంశాలు ఉపాధ్యాయులకు రూపొందించా లన్నారు. ప్రతి ఉన్నత పాఠశాల, ఆదర్శ ప్రైమరీలకు డేటా ఎంట్రీ ఆపరే టర్లను నియమించాలన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయుల స మస్యలు పరిష్కరించాలని, కేజీబీవీ, గురుకుల, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యా యులకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉండే అన్నీ జీవోలను వర్తింపజేయాలని కోరారు. పీఆర్‌టీయూ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంటు రవికు మార్‌, రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంటు కేవీ రమణయ్య, రామకృష్ణ, పీఆర్‌టీయూ ఉపాధ్యా య సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:01 PM