ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి: ఎస్టీయూ
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:19 PM
ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు నాయకులు కోరారు.
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు నాయకులు కోరారు. నంద్యాల రామకృష్ణా డిగ్రీ కళాశాలలో రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఆజాంబేగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ని సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించేం దుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. మెడికల్ బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంద ని, మెడికల్ రీయంబర్స్‌మెంట్ గరిష్ఠ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో జూలై నెలలో భారీ ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యమా నికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వెంకట్రామిరెడ్డి, ఇలియాస్‌బాషా, శివశంకర్, నాగేంద్రకుమార్, మౌలాలి, నూరుల్లా, సుబ్బారాయుడు, శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.