Share News

టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:52 PM

నగరంలోని కిడ్స్‌ వరల్డ్‌ నుంచి కల్లూరు దర్వాజా వరకు రహదారి విస్తరణ (ఆర్డీపీ-2)కు సంబంధించిన టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం చేశామని కార్పొరేషన కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ అన్నారు.

టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

కార్పొరేషన కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు కల్చరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): నగరంలోని కిడ్స్‌ వరల్డ్‌ నుంచి కల్లూరు దర్వాజా వరకు రహదారి విస్తరణ (ఆర్డీపీ-2)కు సంబంధించిన టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం చేశామని కార్పొరేషన కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన నగరంలోని ఉస్మానియా కళాశాల రోడ్డులోని కేఎం హాస్పిటల్‌ వద్ద విస్తరణ కొలతలను పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ నగరా భివృద్ధిలో భాగంగా ట్రాఫిక్‌ నియంత్రణకు రహదారి విస్తరణ పనులు చేపట్టను న్నట్లు, త్వరలో టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. 180 ఆస్తులు ప్రభావితం అవ్వగా, 50 మంది బాదితుల వరకు సమ్మతి పత్రాలు సమ ర్పించారని, మిగిలిన బాధితులు సైతం వెంటనే పత్రాలు సమర్పిస్తే టీడీఆర్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. ఆయన వెంట ఇనచార్జి సిటీ ప్లానర్‌ వై. వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌బాషా, బిల్డింగ్‌ ఇన్సస్పెక్టర్‌ మధుగోపాల్‌, మాజీ కార్పొరేటర్‌ కురుబ పరమేష్‌, మహబూబ్‌ఖాన ఉన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:52 PM