టీడీపీకి కార్యకర్తలే బలం
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:45 AM
టీడీపీకి కార్యకర్తలే బలం అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ కార్యకర్తలను మంత్రి బీసీ సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అభినందించారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, జనవరి 5(ఆంధ్రజ్యోతి): టీడీపీకి కార్యకర్తలే బలం అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ కార్యకర్తలను మంత్రి బీసీ సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలు, అందించారు. మంత్రి మాట్లాడుతూ టీడీపీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని గ్రామస్థాయి నుంచి తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు మరింత కష్టపడి సమన్వయంతో పనిచేయాలని కోరారు.