కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యం
ABN , Publish Date - May 29 , 2026 | 12:11 AM
కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
గోస్పాడు, మే 28 (ఆంధ్రజ్యోతి) : కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమం రెండోరోజు గోస్పాడులో జనసందోహం మధ్య అట్టహాసంగా జరిగింది. టీడీపీ మండల అధ్యక్షుడు కాటంరెడ్డి తులసీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి నాయకులు, కార్యకర్తలు ఎంతో అండగా నిలబడ్డారని అన్నారు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీ బలంగా నిలబడడానికి కార్యకర్తలే మూల స్థంభాలు అన్నారు. రాష్ట్రంలో మహిళలకు డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం చంద్రబాబు, లోకేష్ పాటుపడుతున్నారని అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ 5లక్షల బీమా వర్తింపజేసి అండగా నిలబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహానాడు పరిశీలకులు తిమ్మయ్య చౌదరి, క్లస్టర్ ఇన్‌చార్జి మనోజ్, భూమా హుస్సేని, జూపల్లె రామగోపాల్ రెడ్డి, విశ్వనాథ రెడ్డి, జిన్ను శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.