Share News

కష్టకాలంలో టీడీపీ ఆదుకుంటుంది

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:14 AM

టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబాలను కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి ఆదుకుంటుందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

కష్టకాలంలో టీడీపీ ఆదుకుంటుంది
చెక్కు పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బీమా పరిహారం పంపిణీ చేసిన మంత్రి బీసీ

బనగానపల్లె, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబాలను కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి ఆదుకుంటుందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఇటీవల ప్రమాదాల్లో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం రూ.5లక్షల చొప్పున ఇరు కుంటుంబాలకు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల కుటుంబాలకు సీఎం చంద్రబాబు, యువనేత నారాలోకేశ్‌ అత్యంత ప్రాధాన్యమిస్తారన్నారు. నాయకులు శంకర్‌, రాయలసీమ సలాం పాల్గొన్నారు.

ఉన్నత పాఠశాలలో సమస్యలను పరిష్కరించండి

బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని హెచ్‌ఎం. వెంకటేశ్వర్లు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆర్వో ప్లాంటు, ఏర్పాటుచేయాలని, పాఠశాల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు నిర్మించాలని కోరారు. తగరగతి గదులకు మర్మమలులు చేసి, బండలు వేయించాలని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాఽధ్యాయులు సురేశ్‌రెడ్డి, శివకుమార్‌, మహమ్మద్‌రఫీ, సీఆర్‌పీ సుధాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:15 AM