Share News

పేదల కోసమే టీడీపీ ఆవిర్భావం

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:06 AM

పేదల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

పేదల కోసమే టీడీపీ ఆవిర్భావం
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌

చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు

కర్నూలు అర్బన, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పేదల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. నగరంలోని తనిష్క ఫంక్షన్‌ హాలులో టీడీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యక్రమాల ద్వారా పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను మంత్రి అభినం దించారు. టీజీ భరత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం సీఎం చంద్ర బాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేశ కొత్త ఆలోచనలతో నాయకులు, కార్యకర్తలను కలుస్తూ పార్టీని ముం దుకు తీసుకెళ్తున్నారన్నారు. అమరావతిని రాజధానిగా శాశ్వతంగా ఉండేలా ఆసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. భవిష్యతలో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతిని కదిలించ లేరన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌, నగర అధ్యక్షులు రవి, బొందిలి కార్పొరేషన్‌ చైర్మన విక్రమ్‌ సింగ్‌, డైరెక్టర్లు సంజీవలక్ష్మి, రాజ్యలక్ష్మి, మారుతి శర్మ, కౌశీక్‌, రాజు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

కల్లూరు: పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో 33వ వార్డులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో గౌరు చరిత కేక్‌కట్‌ చేశారు. ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలో చేపట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. టీడీపీ బలోపేతానికి ప్రతిఒక్క కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వతమ్మ ఎమ్మె ల్యేకు కేక్‌ తినిపించారు. కల్లూరు అర్బన 16 వార్డుల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే సన్మానించారు. కల్లూరు 16 వార్డుల టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోడుమూరు: టీడీపీ పేదల పార్టీని అని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కోడుమూరులో పార్టీ కార్యాల యాన్ని కేడీసీసీబీ చైర్మన్‌ డి.విష్ణువర్ధన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారం భించారు. అనంతరం పార్టీ జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కోసం టీడీపీ ఆవిర్భవించిందని అన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు ప్యాలకుర్తి వెంకటేశ్వర్లు, మధు, బాలకిట్టు, బడెసాగౌడ్‌, రవి, మల్లేష్‌ పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండల కేంద్రమైన ఓర్వకల్లులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓర్వకల్లు రచ్చకట్ట వద్ద టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్‌ నాగిరెడ్డి, హుశే నాపురంలో టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్‌, కాల్వబుగ్గ మాజీ చైర్మన చంద్రపెద్ద స్వామి, కొమరోలు గ్రామంలో టీడీపీ నాయకులు భాస్కర్‌ రెడ్డి భగవంతరెడ్డి, రామ చంద్రుడు, కేశవరెడ్డి, గుట్టపాడులో సర్పంచ మోహన రెడ్డి, పాలకొలనులో సర్పంచ చదువుల సుజాతమ్మ, టీడీపీ నాయకులు సుధాకర్‌ రెడ్డి, నన్నూరులో విశ్వేశ్వరరెడ్డి, కన్నమడ కలలో సుధాకర్‌రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో నాయకులు కేవీ మధు, సుధాకర్‌, లక్ష్మీకాం తరెడ్డి, భాస్కర్‌ రెడ్డి, అల్లాబాబు, ఏసేపు, శేఖరప్ప, కాటినేని నారాయణ, బజారు, వేణు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 01:06 AM