Share News

ఆళ్లగడ్డలో టీడీపీ జోరు..

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:56 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇప్పటికే మున్సిపాలిటీ ఏకగ్రీవం కాగా, చైర్‌పర్సన్‌గా హనీషా ఎన్నికయ్యారు. అలాగే ఈ నెల 5న ఎన్నికలు నిర్వహించగా, 10 ఎంపీటీసీ స్థానాల్లో ఆరు స్థానాలు టీడీపీ 1 జనసేన గెలుచుకున్నాయి

ఆళ్లగడ్డలో టీడీపీ జోరు..
మ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవ్‌రాంతో రాజశేఖర్‌రెడ్డి

ఆళ్లగడ్డ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇప్పటికే మున్సిపాలిటీ ఏకగ్రీవం కాగా, చైర్‌పర్సన్‌గా హనీషా ఎన్నికయ్యారు. అలాగే ఈ నెల 5న ఎన్నికలు నిర్వహించగా, 10 ఎంపీటీసీ స్థానాల్లో ఆరు స్థానాలు టీడీపీ 1 జనసేన గెలుచుకున్నాయి. అలాగే మొత్తం 6 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పార్టీ నాయకుడు భార్గవరామ్‌ను ఎంపీటీసీ, జడ్పీటీసీలు కలిశారు. ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని, ఆళ్లగడ్డ ప్రజలు తమపై పెట్టుకొన్న నమ్మకానికి ప్రాతిపదిక అని అన్నారు.

ఎంపీపీలుగా టీడీపీ ఎంపీటీసీలు..

ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, శిరివెళ్ల, ఉయ్యాలవాడ మండలాధ్యక్షులుగా టీడీపీ ఎంపీటీసీలే ఎన్నికయ్యే అవకాశముంది. ఎంపీపీలుగా టీడీపీ నుంచి గెలుపొందిన వీరిలో శీలం గీతావాణి(నల్లగట్ల), ఇ.మౌనిక(బత్తలూరు), దూదేకుల అశోక్‌ (ఓబులంపల్లె), వీరన్న(మిట్టిపల్లె), బుక్కే మల్లేశ్వరిబాయ్‌(బాచేపల్లె), రసూల్‌బీ(ఆర్‌.కృష్ణాపురం)ఎంపీటీసీలే ఎన్నికయ్యే అవకాశముంది. కాగా ఉదయ్‌శ్రీ(పాతకందుకూరు-జనసేన), వైసీపీ నుంచి మేకల లక్ష్మి(జి.జంబులదిన్నె)భారతి(అహోబిలం), లక్ష్మిదేవి(కోటకందుకూరు) గెలుపొందారు.

కాగా నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపిటీసీ స్ధానాలు ఉండగా, టీడీపీ-42, వైసీపీ-25, జనసేన-4 స్ధానాలను కైవసం చేసుకున్నాయి. వీటిలో చాగలమర్రిలో 15 స్థానాలకు 8-టీడీపీ, 1-జనసే, 6-వైసీపీ, దొర్నిపాడు మండలంలో 7 ఎంపీటీసీలకు గాను 5-టీడీపీ, రుద్రవరం 14 ఎంపీటీసీలకు గాను 7-టీడీపీ, 1-జనసేన, 6-వైసీపీ దక్కింది. శిరివెళ్ల మండలంలో 17 ఎంపీటీసీలకు గాను 11-టీడీపీ, 6-వైసీపీ, ఉయ్యలవాడ మండలంలో 8 స్ధానాలకు 5-టీడీపీ, 2-వైసీపీ, 1 జనసేనకు దక్కాయి.

Updated Date - Nov 09 , 2026 | 11:56 PM