పల్లెపోరులో కూటమి సత్తా..
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:53 AM
మండలంలో ఆదివారం మొత్తం 12 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించినట్లు ఎంపీడీవో నాగరాజు తెలిపారు. టీడీపీ మద్దతుదారులు ఇల్లూరు కొత్తపేట సర్పంచ్‌గా ఇనగనూరు రామిరెడ్డి, పాతపాడు సర్పంచ్‌గా భూమిరెడ్డి అపర్ణరెడ్డి, మీరాపురంలో బత్తుల స్వర్ణలత అలాగే, కృష్ణగిరి సర్పంచ్‌గా నారబోయిన తిమ్మరాజు, చిన్నరాజుపాలెం తండా సర్పంచ్‌గా కృష్ణానాయక్, తమ్మడపల్లె సర్పంచ్‌గా కొమ్మురెడ్డి మల్లేశ్వరి గెలుపొందారు
బనగానపల్లె, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, అవుకు, సంజామలలో అధిక పంచాయతీలు టీడీపీ మద్దతుదారుల కైవసం
టీడీపీ మద్దతుదారులు 6, వైసీపీ 5..
బనగానపల్లె, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివారం మొత్తం 12 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించినట్లు ఎంపీడీవో నాగరాజు తెలిపారు. టీడీపీ మద్దతుదారులు ఇల్లూరు కొత్తపేట సర్పంచ్‌గా ఇనగనూరు రామిరెడ్డి, పాతపాడు సర్పంచ్‌గా భూమిరెడ్డి అపర్ణరెడ్డి, మీరాపురంలో బత్తుల స్వర్ణలత అలాగే, కృష్ణగిరి సర్పంచ్‌గా నారబోయిన తిమ్మరాజు, చిన్నరాజుపాలెం తండా సర్పంచ్‌గా కృష్ణానాయక్, తమ్మడపల్లె సర్పంచ్‌గా కొమ్మురెడ్డి మల్లేశ్వరి గెలుపొందారు. ఇక వైసీపీ మద్దతుదారులు టంగుటూరు సర్పంచ్‌గా గాలి లక్ష్మిదేవి, వెంకటాపురం సర్పంచ్‌గా దాసరి పద్మావతి, చెర్వుపల్లె సర్పంచ్‌గా పుల్లయ్య అలాగే తిమ్మాపురం సర్పంచ్‌గా గొల్లనారాయణమ్మ, ఎర్రగుడిలో పార్వతి విజయం, పసుపలలో హేమలత విజయం సాధించారు.
కోవెలకుంట్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా మండలంలో 10 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ మద్దతుదారులు కోవెలకుంట్ల సర్పంచ్‌గా కరిమద్దెల లక్ష్మినాగేంద్రబాబు, పొట్టిపాడు సర్పంచ్‌గా నాగేంద్ర రెడ్డి, కలుగొట్లలో పోరెడ్డి రామలక్ష్మీ దేవి, వల్లంపాడు గ్రామంలో బుజుటి అంజనమ్మ అలాగే చిన్న కొప్పెర్ల గ్రామంలో యాట శివకృష్ణ గెలించారు. అలాగే వైసీపీ మద్దతుదారురాలు లింగాల సర్పంచ్‌గా ఏర్వ సంజమ్మ, వెలగటూరులో బొడ్డు కృష్ణవేణి, అమడాల గ్రామంలో చిన్న కందుల భారతి, సౌదరదిన్నె గ్రామంలో మంచాల పద్మావతి, బిజినవేములలో భీమిరెడ్డి ప్రతాప్ రెడ్డి టీడీపీ అభ్యర్ధి అవుకు వెంకటస్వామిపై 27 ఓట్లతో విజయం సాధించారు. అయితే టీడీపీ అభ్యర్ధి రీకౌంటింగ్ కోరడంతో ఆర్వో రీకౌంటింగ్ చేశారు.
టీడీపీ మద్దతుదారులకు 5, వైసీపీకి మూడు స్థానాలు..
సంజామల: మండలంలో 5 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా టీడీపీ మద్దతుదారులు 3 పంచాయతీల్లో, వైసీపీ మద్దతుదారులు రెండుచోట్ల విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు గిద్దలూరు సర్పంచ్‌గా బత్తుల వెంకట ప్రతాప్ రెడ్డి, కానాలలో లక్ష్మీ తులశమ్మ, నట్లకొత్తూరు నుంచి పరమేశ్వర్ రెడ్డి గెలిచారు. ఇక వైసీపీ మద్దతుదారులు నొస్సం సర్పంచ్‌గా పుల్లమ్మ, ఆకుమల్ల నుంచి గౌరుగారి మంగమ్మ విజయం సాధించారు. ఎస్ఐ రమణయ్య బందోబస్తు నిర్వహించారు. కాగా మండలంలో 17 పంచాయతీలుండగా ఇప్పటికే 12 ఏకగ్రీవమైన విషయం విదితమే.
అవుకులో 4 పంచాయతీలు వైసీపీకే..
అవుకు: మండలంలో 21 పంచాయతీలుండగా టీడీపీ 12, వైసీపీ 5 ఏకగ్రీవయ్యాయి. మిగిలిన 4 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. నాలుగు పంచాయతీలల్లోనూ వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు. మెట్టుపల్లె సర్పంచ్‌గా మూరం పద్మావతి, వేములపాడు చిందుకూరి సురే్‌షకుమార్, అన్నవరం రొక్కం వెంకటలక్ష్మమ్మ, మంగంపేట ఎర్రన్నగారి శ్రీకృష్ణుడు విజయం సాధించారు.
కొలిమిగుండ్ల: మండలంలో 23 పంచాయతీలు ఉండగా 18 గ్రామపంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులే ఎన్నికయ్యారు. ఆదివారం 7 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 2 టీడీపీ, 4 వైసీపీ మద్దతుదారులే గెలించారు. టీడీపీ కొలిమిగుండ్ల సర్పంచ్‌గా ఉలవల నరసింహుడు, కల్వటాల సర్పంచ్‌గా బోడి హిమవర్షిణి గెలిచారు. ఇక వైసీపీ మద్దతుదారులు తోళ్లమడుగు సర్పంచ్‌గా అంబులదిన్నె జయమ్మ, ఎర్రగుడి సర్పంచ్‌గా అమరనాధ్ రెడ్డి, తిమ్మనాయునిపేట సర్పంచ్‌గా గాజుల మాబువలి, పెట్నికోట సర్పంచ్‌గా ఎర్రబోతుల సరస్వతి విజయం సాధించారు. తుమ్మలపెంటలో తోట మల్లేశ్వరరెడ్డి గెలిచారు.