టీడీపీ మద్దతుదారుల హవా..
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:20 AM
మండలంలో గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 17 పంచాయితీలకు గాను 15 పంచాయతీల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అహోబిలం సర్పచ్‌గా రామాంజనేయులు, ఓబులంపల్లెలో ఎద్దుల చండిప్రియ, జి.జంబులదిన్నెలో లక్ష్మిదేవి, గూబగుండంలో బాలకృష్ణ, ఆర్.కృష్ణాపురం కు గోపిరెడ్డి వెంకట శివారెడ్డి, మర్రిపల్లెలో పత్తి నాగేశ్వరమ్మ, బాచేపల్లె లో పాములేటి నాయక్, కోటకందుకూరులో నర్సిపల్లె ఇమాంబి విజయం సాధించారు
పంచాయతీ మొదటి విడత పోరులో అత్యధిక స్థానాల్లో టీడీపీ మద్దతుదారులైన అభ్యర్థుల విజయం
అహోబిలంలో ఎమ్మెల్యే వాహనంపై దాడి.. ఉయ్యాలవాడ, రుద్రవరంలో ఉద్రిక్తత
ఆళ్లగడ్డలో 15 సర్పంచ్ స్థానాలు కైవసం
ఆళ్లగడ్డ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 17 పంచాయితీలకు గాను 15 పంచాయతీల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అహోబిలం సర్పచ్‌గా రామాంజనేయులు, ఓబులంపల్లెలో ఎద్దుల చండిప్రియ, జి.జంబులదిన్నెలో లక్ష్మిదేవి, గూబగుండంలో బాలకృష్ణ, ఆర్.కృష్ణాపురం కు గోపిరెడ్డి వెంకట శివారెడ్డి, మర్రిపల్లెలో పత్తి నాగేశ్వరమ్మ, బాచేపల్లె లో పాములేటి నాయక్, కోటకందుకూరులో నర్సిపల్లె ఇమాంబి విజయం సాధించారు. అలాగే ఎస్.లింగందిన్నెలో జనసేన బలపరిచిన అభ్యర్తి దూదేకుల దస్తగిరమ్మ, గోపులాపురంలో వడ్ల సురేంద్ర చారి, పాత కందుకూరులో పుల్లారెడ్డి గెలుపొందారు. ఇక వైసీపీ మద్దతురాలు యాదవాడలో ఓబులమ్మ, నల్లగట్లలో వేములపాటి యశోద, బత్తలూరులో ఉమామహేశ్వరరెడ్డి విజయం సాధించారు. జి.జంబులదిన్నేలో ఒక వర్గం వారు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని గంటసేపు పోలింగ్ ను నిలిపి వేశారు. అడిషనల్ ఎస్పీ చేరుకుని పరిస్థితని సమీక్షించారు.
ముగ్గురు టీడీపీ, ఐదుగురు వైసీపీ, ఇద్దరు ఇండిపెండెంట్లు..
ఉయ్యాలవాడ: మండలంలోని పది పంచాయతీల్లో ముగ్గురు టీడీపీ మద్దతుదారులు, ఐదుగురు వైసీపీ మద్దతుదారులు, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. తుడుమలదిన్నె గ్రామంలో వేములపాటి సులోచన, పుచ్చకాయపల్లె గ్రామంలో దాసరి శివమ్మ, మాయలూరు గ్రామంలో బచ్చు హైమావతి, సర్వాయిపల్లెలో లింగం తిరుపాలు, నర్శిపల్లెలో మర్రి మరియమ్మ, కాకరవాడలో చండ్ర వరలక్ష్మి, కొండుపల్లెలో జి.రాజేష్, గోవిందపల్లెలో చామల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దయమ్మనూరులో ఎగ్గోని వెంకటక్రిష్ణ, హరివరంలో పల్లె మహేశ్వరమ్మ గెలుపొందారు.
శిరివెళ్ల: మండలంలో మొత్తం 16 పంచాయతీలకుగాను 3 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 13 పంచాయతీల్లో సర్పంచ్‌తోపాటు, 127 వార్డు స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. వీరంతా టీడీపీ బలపరిచిన అభ్యరులు చెన్నూరు సర్పంచ్‌గా బండారు చెన్నమ్మ, మహదేవపురంలో కురువ వెంకట రత్నమ్మ, జీనేపల్లెలో నందిపల్లె సుంకన్న, కామినేనిపల్లెలో లక్క జయమ్మ, గంగవరంలో చెన్నారెడ్డిగారి జనార్ధన్‌రెడ్డి, శిరివెళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా ముల్లా మహమ్మద్ హుసేన్ విజయం సాధించారు. ఇక వైసీపీ మద్దతుదారులు వనికెందిన్నెలో చిటికెల వెంకటేశ్వర్లు, వీరారెడ్డిపల్లెలో మందాల శివారెడ్డి, కోటపాడులో దూదేకుల గుర్రప్ప, గుండంపాడులో దాసి సుబ్బమ్మ, మోత్కలపల్లెలో మార్తల శివ పార్వతి గెలుపొందారు.
5 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారుల ప్రభంజనం
దొర్నిపాడు: మండలంలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 5 పంచాయతీలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ బనపర చిన అభ్యర్థులు కొండాపురం సర్పంచ్‌గా చవ్వాశివారెడ్లి, బుర్రారెడ్డిపల్లెలో కాకర్ల యువరేఖ, క్రిష్టిపాడులో గడ్డం భాగ్యమ్మ, గుండుపాపల జి.అపర్ణ, అర్జునాపురం నాగలింగమయ్య గెలిచారు. కాగా ఇప్పటికే 6పంచా యతీ లు ఏకగ్రీవం కావడంతో మొత్తం గ్రామ పంచాయతీలను టీడీపీ కైవసం చేసుకున్నట్లుయింది. ఎస్‌ఐ వరప్రసాద్ బందోబస్తు నిర్వహించారు.
టీడీపీ మద్దతుదారులు 11
రుద్రవరం: మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా, 1 ఏకగ్రీవమైంది. మిగిలిన 20 పంచాయతీలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ బలపరచిన అభ్యర్థులు 11 స్థానాల్లో గెలుపొందార. ఆలమూరు సర్పంచ్గఆ శెట్టి వేణుగోపాల్, బీరవోలు సుశీలమ్మ, కొండమాయపల్లెలో బంగారు ఆదిలక్ష్మిదేవి, చిలకలూరులో ముల్ల హసీనా, చిన్నకంబలూరులో నారాయణమ్మ, పెద్దకంబలూరులో శివమ్మ 31, మందలూరులో బండి వీరభద్రుడు, ముత్తలూరులో సూర్యనారాయణరెడ్డి, దక్షిణకొట్టాలలో భూమిరెడ్డి వీరలక్ష్మి, హరినగరం సుబ్బరాయుడు, చందలూరు పుట్టిక వెంకటలక్షమ్మ గెలుపొందారు. ఇక వైసీపీ మద్దతురాలు నరసాపురం సర్పంచ్‌గా చరణం వెంకోబరావు, పేరూరులో జయమ్మ, రుద్రవరంలో లక్ష్మినరసమ్మ, శ్రీరంగాపురంలో ఎం.లక్ష్మినరసమ్మ, టి.లింగందిన్నెలో బద్రి వెంకటన్న, చిత్తరేణిపల్లెలో జె.చిన్నమాధవ్, కోటకొండ డేగాని వెంకటేశ్, యల్లావత్తులో డి.శాంతి ఆర్.నాగలవరంలో వైసీపీ రెబల్ మద్దతుదారుడు పర్వతం నరసింహులు విజయం సాధించారు.
చాగలమర్రి: 19 పంచాయతీలకు గాను నాలుగు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. కాగా 15 సర్పంచ్‌లు, 223, వార్డు సభ్యులకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. కాగా టీడీపీ మద్దతుదారులు 10, వైసీపీ మద్దతుదారులు 5 స్థానాలు గెలుచుకున్నారు. టీడీపీ మద్దతురాలు చాగలమర్రి సర్పంచ్‌గా జి.షాహిన్, పెద్దవంగలిలో సుబ్బలక్ష్మమ్మ, ముత్యాలపాడులో బోయిన శ్రీరాములు, తోడెండ్లపల్లెలో యు.పద్మజ, శెట్టివీడుకు కరిమున్నిసా, పెద్దబోదనంకు గడ్డం ఓబులేసు, చిన్నబోధన ంకు జి.నాగేంద్ర, గొడిగనూరులో జింకల లక్ష్మీదేవి, బ్రాహ్మణపల్లెలో మీనా కుమారి, మల్లేవేములలో టి.లక్ష్మీదేవి, గెలుపొందారు. ఇక వైసీపీ మద్దతుదారులు మద్దూరు సర్పంచ్‌గా దస్తగిరి, కేపీ తండాలో రాములనాయక్, రాంపల్లెలో మేకల లక్ష్మీనర్సమ్మ, చింతలచెరువులో సుబ్రహ్మణ్యం, కలుగొట్లపల్లెలో చిన్నరాముడు ు ఎంపికయ్యారు. అన్నారు. వీరికి పోలింగ్ కేంద్రాల్లో డిక్లరేషన్ ఇచ్చినట్లు ఆర్‌వో తాహిర్‌హుసేన్ తెలిపారు. ఏవో రాజేంద్రప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో తారకేశ్వరి, ఈవో షబియాబేగం, కో-ఆర్డినేటర్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.