Share News

బీసీలకు అండగా టీడీపీ

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:14 PM

రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత కల్పించి బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

బీసీలకు అండగా టీడీపీ
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత కల్పించి బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నాటి ఎన్టీఆర్‌ నుంచి నేటి చంద్రబాబు వరకు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దక్కింది కేవలం టీడీపీలోనే అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం జీఓ 105ను జారీ చేసిందన్నారు. ఈ మేరకు శాసనసభలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఏపీ హైకోర్టు 105జీఓతో పాటు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన జీఓ 1065ను రద్దు చేసిందన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించి బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించటం సాధ్యం కాదన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో టీడీపీ, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఏఎంసీ చైర్మన్‌ మల్లయ్య, నాయకులు తిరుపతయ్య నాయుడు, వెకంటేశులు, డీలర్‌ ఈరన్న, పెద్ద రాముడు, నాగయ్య, తిమ్మారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 11:14 PM