ఏకగ్రీవాల్లో టీడీపీ హవా
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:15 AM
డోన్, బనగానపల్లె నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అత్యధిక స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. 39 ఏళ్ల అనంతరం అవుకు ఎంపీపీ స్థానం ఆ పార్టీ దక్కించుకోవడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి బీసీ రాజకీయ వ్యూహం ఫలించిందని ఆ పార్టీవారు సంబరాలు చేసుకుంటున్నారు.
అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్ట్టీ కైవసం
ఎంపీపీలుగా టీడీపీ అభ్యర్థులకే అవకాశం
ఫలించిన మంత్రి రాజకీయ చతురత
బనగానపల్లెలో అన్ని స్థానాలు...
బనగానపల్లె, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఆర్వో సుధాకర్ అధికారికంగా అందించారు. 29 స్థానాలు ఉండగా టీడీపీ-18, వైసీపీ-10 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. క్రిష్ణగిరి ఎంపీటీసీకి నామినేషన్ దాఖలు చేసిన ఇరువురు జనసేన అభ్యర్థుల నామినేషను తిరస్కరించామని అక్కడ ఎన్నిక వాయిదా పడినట్లు తెలిపారు. పలుకూరు1 ఎంపీటీసీ గుండం మీనాకుమారి ఎంపీపీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఏఆర్వోలు చంద్రశేఖర్, నాగరాజు, తిరుమలేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బనగానపల్లె జడ్పీటీసీగా షేక్ బురానుద్దీన్
బనగానపల్లె జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి షేక్ బురానుద్దీన్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గతంలో ఉపసర్పంచ్‌గా పనిచేశారు, మంత్రి బీసీకి ముఖ్య అనుచరునిగా ఉన్నారు. ఇతరులు నామినేషన్ ఉపసంహకరించుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
డోన్‌లో 11 స్థానాలు ఏకగ్రీవం, టీడీపీ- 7, వైసీపీ-4
డోన్ టౌన్: మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11 స్థానాలు మంగళవారం ఏకగ్రీవమయ్యాయి. 46 నామినేషన్లు దాఖలు కాగా, 19 మంది అభ్యర్థులు ఉపసంహకరించుకున్నారు. ఏకగ్రీవమైన వాటిలో టీడీపీ తరపున వెంకటనాయునిపల్లి-లక్ష్మీ పార్వతమ్మ, వెంకటాపురం-గూడూరు గౌరి, కొట్రాయి-ఏ.శ్రీహరి, గోసానిపల్లి-మనికే లక్ష్మిదేవి, చిన్నమల్కాపురం-1 బింగిసాగర్, ఉడుములపాడు-ఉప్పర రామాంజనేయులు, ధర్మవరం-మాదిగ చెన్నమ్మ ఉన్నారు. అలాగే వైసీపీ తరపున కొచ్చెర్వు-సురమ్మగారి జయలక్ష్మి, దేవరబండ-టెంకాయచెట్టు రవి, కొత్తకోట-పి.సుధాకర్ (వైసీపీ), చిన్నమల్కాపురం2 -బి.రాజ్‌కుమార్ ఉన్నారు. 7 స్థానాలకు అభ్యర్థులు బరిలో నిలిచారని ఆర్వో రామాంజనేయులు తెలిపారు.
అవుకు జడ్పీటీసీగా చల్లా విజయభాస్కర్‌రెడ్డి
అవుకు: పట్టణానికి చెందిన చల్లా విజయబాస్కర్‌రెడ్డి అవుకు జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిట అధికారులు మంగళవారం ప్రకటించారు. అన్ రిజర్వుడ్ (జనరల్)కు కేటాయించగా, టీడీపీ నుంచి చల్లా విజయభాస్కర్‌రెడ్డి, వైసీపీ నుంచి కాటసాని తిరుపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి లక్ష్మిదేవి నామినేషన్ వేశారు. అయితే తిరుపాల్‌రెడ్డి, లక్ష్మిదేవి నామినేషన్లు తిరస్కరణకు గురికావటంతో ఆయన ఎంపికైనట్లు అధికారులు ప్రకటించారు.
అవుకులో టీడీపీకి 11, వైసీపీకి-5
16 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీ 11, వైసీపీ 5 స్థానాల్లో ఏకగ్రీవం అయినట్లు ఆర్వో వేణుగోపాల్ మంగళవారం పేర్కొన్నారు. అనంతరవ వారికి డిక్లరేషన్ ఫారాలను అందించారు. టీడీపీ నాయకుడు పక్కీరరెడ్డి, తహసీల్దార్ ఫకీర్‌అహ్మద్, ఎంపీడీవో రామకృష్ణవేణి, సిబ్బంది ఉన్నారు.
టీడీపీ 11, వైసీపీకి 8 స్థానాలు ఏకగ్రీవం
ప్యాపిలి: మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు 36 నామినేషన్లు దాఖలు కాగా, మంగళవారం 13 అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 11 స్థానాలు టీడీపీకి, 8 స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. ప్యాపిలి-2, ప్యాపిలి-4, కలచట్ల, భోంచెర్వుపల్లి, గుడిపాడు, హుసేనాపురం, జలదుర్గం-1, ఎన్. రంగాపురం, పెద్దపూదిళ్ల, పోతుదొడ్డి, వెంగళాంపల్లి ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి, ప్యాపిలి-3, ప్యాపిలి-1, జలదుర్గం-2, బూరుగుల, నేరేడుచెర్ల, పీఆర్పల్లి, ఊటకొండ, రాచెర్ల స్థానాలు వైసీపీకి వచ్చాయి. టీడీపీ ఎంపీపీ అభ్యర్థి రాజశేఖర్‌నాయుడు కలచట్ల నుంచి ఎన్నికయ్యారు. మాధవరం, జక్కసానికుంట్ల ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఆర్వో శ్రీనివాసరావు తెలిపారు. ఎంపీపీ పదవి టీడీపీకి ఎంపీటీసీ రాజశేఖర్ నాయుడు ఎన్నికయ్యే అవకాశం ఉంది. జడ్పీటీసీగా క్రిష్ణమూర్తియాదవ్(వైసీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బేతంచెర్లలో 15 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
బేతంచెర్ల: మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఆర్వోలు బషీరున్నిసా బేగం, ఫజిల్ రెహమాన్ తెలిపారు. టీడీపీ- వైసీపీ-6 మంది ఎన్నికయ్యారు.
కొలిమిగుండ్లలో టీడీపీ-10, వైసీపీ-5
కొలిమిగుండ్ల: మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఆర్వో హరినాథరెడ్డి ప్రకటించారు. టీడీపీ-10, వైసీపీ-5 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 34 నామినేషన్లు రాగా మిగిలినవారంతా ఉపసంహరించుకోవడంతో ఆన్ని స్థానాలు ఏకగ్రీవం అయినట్లు ఆర్వో హరినాథరెడ్డి వెల్లడించారు.
కొలిమిగుండ్ల జడ్పీటీసీ, ఎంపీపీ టీడీపీ కైవసం ..
నియోజకవర్గంలో వైసీపీ కంచుకోట బద్దలైంది. కొన్నేళ్లుగా వైసీపీకి అండగా నిలిచిన కొలిమిగుండ్ల జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి నంద్యాల రామేశ్వరరెడ్డి సతీమణి నంద్యాల రమాదేవి ఎన్నికయ్యారు. ఇక 10 ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి ఏకగ్రీవం కావడంతో ఎంపీపీ స్థానం టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. దీంతో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
కోవెలకుంట్లలో 14 ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఏకగ్రీవం
కోవెలకుంట్ల: మండలంలోని 14 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఆర్వో చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. టీడీపీ-8, జనసేన-1, బీజేపీ-1, వైసీపీ-4 స్తానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి గడ్డం నారాయణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పద్మావతి, ఇండిపెండెంట్‌గా రమణమ్మ, వైసీపీ నుంచి సుమతి నామినేషన్లను ఉపసంహరరించుకోవడంతో నారాయణమ్మ ఎన్నికైనట్లు ప్రకటించారు. తనకు అవకాశం ఇచ్చిన మంత్రి బీసీకి నారాయణమ్మ, గడ్డం రామకృష్ణారెడ్డి, గడ్డం నాగేశ్వర్ రెడ్డి గడ్డం అమరనాధ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
అవుకు అభివృద్ధికి కృషి చేయాలి
అవుకు: ఎంపీటీసీలు అవుకు మండల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎంపీటీసీలుగా ఎన్నికైన ఉగ్రసేనారెడ్డి ఆయన సతీమణి వీణారాణి, కాట్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వెంకటరమణనాయక్, దూదేకుల హుశేన్‌బీ, లక్ష్మీదేవి, విజయభాస్కర్, షేకున్బీ, యేసయ్య, శంకరీభాయి, వెంకటరామయ్య బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని సన్మానించారు. నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని ఎంపీటీసీలు తెలిపారు.
ఉయ్యాలవాడలో 2 ఏకగ్రీవం
ఉయ్యాలవాడ: మండలంలోని 8 ఎంపీటీసీ స్ధానాలు ఉండగా టీడీపీ తరపున బోడెమ్మనూరు-గోపిరెడ్డి హరిప్రసాదరెడ్డి, అల్లూరు-కర్రా రమేష్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో నాగమునేశ్వరి ప్రకటించారు. మిగతా హరివరం, మాయలూరు, పెద్ద ఎమ్మనూరు, ఆర్.జంబులదిన్నె, ఆర్.పాపంపల్లె, ఉయ్యాలవాడలో 17 మంది బరిలో ఉన్నారని తెలిపారు.
39 ఏళ్ల తర్వాత టీడీపీకి ఎంపీపీ పీఠం
అవుకు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): చల్లా కుటుంబానికి కంచుకోటగా ఉన్న అవుకు మండలం ఎట్టకేలకు టీడీపీకి చిక్కింది. మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి చక్రం తిప్పటంతో 39 ఏళ్ల తరువాత చల్లా కుటుంబం నుంచి ఎంపీపీ పీఠం చేజారింది. మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా టీడీపీ-11, వైసీపీ- 5 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. ఎంపీపీ స్థానం అన్ రిజర్వ్డ్ (మహిళ)కు కేటాయించటంతో మండల టీడీపీ అఽధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి సతీమణి వై. వీణారాణి (శింగనపల్లె ఎంపీటీసీ) ఎంపీపీ రేసులో నిలిచింది. దివంగత మాజీ ఎమ్మెల్సీ చల్లా రామక్రిష్ణారెడ్డి హయంలో అధికారంలో ఉన్నా లేకపోయినా అవుకు మండలం మాత్రం వారికే దక్కేది. 1987 నుంచి గత ఎన్నికల వరకు చల్లా కుటుంబ సభ్యులో ఎంపీపీగా ఎన్నికయ్యారు. కాగా చల్లా భగీరథరెడ్డి మృతి చెందటంతో మండలం రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇరువురి మృతి తరువాత కొంత కాలం చల్లా కుటుంబంలో రాజకీయ ఆదిపత్యం కోసం పోరు సాగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చల్లా, కాటసాని ఏకమైనా మంత్రి బీసీ చక్రం తిప్పటంతో అవుకు మండలంలో టీడీపీకి 1,666 ఓట్ల మెజారిటీ వచ్చింది. అనంతరం ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మంత్రి రాజకీయ చతురతతో మొదటిసారిగా ఎంపీపీ పదవి తమకు దక్కడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.