డోన్‌లో టీడీపీ మరింత బలపడాలి
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:07 AM
డోన్‌లో తెలుగుదేశం పార్టీ మరింత బలపడాలని సీఎం చంద్రబాబు కార్యకర్తలతో అన్నారు. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమీక్ష నిర్వహించారు. ఓటుశాతం పెంచేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
డోన్ టౌన్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): డోన్‌లో తెలుగుదేశం పార్టీ మరింత బలపడాలని సీఎం చంద్రబాబు కార్యకర్తలతో అన్నారు. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమీక్ష నిర్వహించారు. ఓటుశాతం పెంచేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, వారు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు పని చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కోట్ల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, టీడీపీ యువ నాయకుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ వాల్మీకి బోయ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్, కోట్రికే ఫణిరాజ్, కొత్తపల్లి రంజిత్ కిరణ్, మిద్దెపల్లె గోవిందు పాల్గొన్నారు.
సీఎం సభకు తరలిన నాయకులు
డోన్ రూరల్: మండలంలోని గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు సీఎం సభకు తరలివెళ్లారు. కొత్తబురుజు గ్రామంలోని సీఎం సభకు వెంకటనాయునిపల్లె, తిమ్మాపురం, కొత్తపల్లి, ఉంగరానిగుండ్ల, కొచ్చెర్వు, కమలాపురం నుంచి ప్రత్యేక వాహనాల్లో మోటారు బైకుల మీద సీఎం సభకు తరలివెళ్లారు.
అడుగడుగునా పోలీసు బందోబస్తు
సీఎం పర్యటన సందర్భంగా అడుగడుగునా పోలీసు బందోబస్తు నిర్వహించారు. కొత్తకోట గ్రామం మీదుగా బొట్రాయి, చిన్నపూదిళ్ల, కొత్తబురుజు గ్రామాల ప్రధాన రోడ్లలో అడుగడుగున పోలీసు బందోబస్తు కనిపించింది. పోలీసు బందోబస్తు నిర్వహించారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సీఎంను చూసేందుకు ఎగబడ్డ జనం
సీఎం చంద్రబాబు కొత్తబురుజు గ్రామానికి సోమవారం రావడంతో ఆయనను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 11.30 నుంచి 12 గంటల సమయంలో హెలిప్యాడ్ కొత్తబురుజు గ్రామం మీదుగా చక్కర్లు కొట్టడంతో ప్రధాన రోడ్ల మీదుగా పార్టీ అభిమానులు, రైతులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.