Share News

తెలుగు తమ్ముళ్ల రగడ

ABN , Publish Date - May 20 , 2026 | 12:03 AM

స్థానిక పంచాయతీ కార్యాల యంలో తెలుగు తమ్ముళ్లు (టీడీపీ నాయకుల) మధ్య రగడ జరిగింది. మంగళవారం ఉదయం ఇరువర్గాల మాటలతో పంచా యతీ కార్యాలయం రణరంగంగా మారింది. మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి వర్గం, టీడీపీ రాష్ట్ర నాయకుడు తిక్కా రెడ్డి వర్గానికి చెందిన నాయకులు తీవ్రస్థాయిలో గొడవకు దిగడం మండలంలో కలకలం రేపింది.

తెలుగు తమ్ముళ్ల రగడ
పంచాయతీ కార్యాలయంలో ఇరువర్గాలను చెదరగొడుతున్న ఎస్‌ఐ

రాఘవేంద్రరెడ్డి, తిక్కారెడ్డి వర్గాల మధ్య మాటల యుద్ధం

ఇరువర్గాలను చెదరగొట్టిన ఎస్‌ఐ

కోసిగిలో గట్టి పోలీసు బందోబస్తు

కోసిగి, మే 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక పంచాయతీ కార్యాల యంలో తెలుగు తమ్ముళ్లు (టీడీపీ నాయకుల) మధ్య రగడ జరిగింది. మంగళవారం ఉదయం ఇరువర్గాల మాటలతో పంచా యతీ కార్యాలయం రణరంగంగా మారింది. మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి వర్గం, టీడీపీ రాష్ట్ర నాయకుడు తిక్కా రెడ్డి వర్గానికి చెందిన నాయకులు తీవ్రస్థాయిలో గొడవకు దిగడం మండలంలో కలకలం రేపింది. మాటమాటా పెరిగి ఒకరిపైఒకరు దాడి చేసుకునేంతవరకు పరిస్థితి వెళ్లడంతో స్థానికంగా తీవ్ర ఉద్రి క్తత నెలకొంది. సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో పంచా యతీల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. టీడీపీ ఇన్‌చార్జి వర్గానికి చెందిన మాజీ సర్పంచ్‌, మాజీ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, పంచాయతీ పరిధిలో తానే పనులు చేయిస్తూ, పంచా యతీ కార్యాలయంలో కూర్చుంటున్నారని తిక్కారెడ్డి వర్గం అభ్యం తరం వ్యక్తం చేసింది. ఈక్రమంలో మంగళవారం ఉదయం తిక్కారెడ్డి వర్గానికి చెందిన కొండగేని వీరారెడ్డి, నాడిగేని చిన్నతాయన్న, నాడిగేని వీరారెడ్డి, నాడిగేని మాదేవా తమ వర్గంతో కలిసి పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. పదవిలో లేకపోయినా కార్యాలయంలో ఎం దుకు కూర్చుంటున్నావు? పనులు నువ్వే ఎలా చేయిస్తావు..? అంటూ ముత్తురెడ్డితో వాగ్వాదానికి దిగారు. ముత్తురెడ్డి వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పంచాయతీ కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో ఇరువర్గాల మోహరింపుతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియని గం దరగోళ పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న వెంటనే కోసిగి ఎస్‌ఐ రమే్‌షరెడ్డి తన పోలీస్‌ సిబ్బందితో కలిసి పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అల్లర్లకు, శాంతిభద్రతల సమస్యకు తావు లేకుండా ఇరువర్గాలను గట్టిగా మందలించి అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం ఇరుపక్షాల నాయకులతో మాట్లాడి వారిని పంచాయతీ కార్యాలయం ఆవరణ నుంచి పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటన అనంతరం ఎస్‌ఐ రమే్‌షరెడ్డి, ఎంపీడీఓ ఎస్‌.ఎం.బాష, ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి రంగస్వామితో ప్రత్యేకంగా సమావేశమై సమస్యపై చర్చించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, కోసిగిలో మళ్లీ ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ మంజునాథ్‌, ఎస్‌ఐ రమే్‌షరెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలో గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ అంతర్గత రగడ వల్ల పార్టీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింటోందని స్వయానా తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

Updated Date - May 20 , 2026 | 12:03 AM