Share News

టీడీపీదే జోరు

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:02 AM

రెండో విడత పంచాయతీ పోరులో టీడీపీదే జోరు కొనసాగింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ఎక్కడికక్కడ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

టీడీపీదే జోరు

రెండో విడతలో 83.47 శాతం పోలింగ్‌

195 సర్పంచ్‌ స్థానాల్లో టీడీపీ-137, వైసీపీ-57 మద్దతుదారులు విజయం

వార్డుల్లోనూ టీడీపీదే హవా

ఆనందంలో కూటమి శ్రేణులు

నంద్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రెండో విడత పంచాయతీ పోరులో టీడీపీదే జోరు కొనసాగింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ఎక్కడికక్కడ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా అన్ని పంచాయతీల్లోనూ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 83.47శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదే క్రమంలో 195 సర్పంచ్‌ స్థానాల్లో టీడీపీ-136, వైసీపీ-57 చొప్పున మద్దతుదారులు విజయం సాధించారు. ఇదే తరహాలో వార్డుల్లోనూ టీడీపీదే హవా కొనసాగింది. ఇప్పటికే తొలి విడత.. తాజా రెండో విడతలోను టీడీపీ సత్తా చాటడంతో వైసీపీ తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తంగా ఇటు సర్పంచ్‌.. అటు వార్డు స్థానాల పరంగా టీడీపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడంతో కూటమి వర్గాల్లో ఆనందోత్సవం మొదలైంది.

వెలుగోడులో..

రెండో విడత సర్పంచ్‌, వార్డుమెంబర్ల పరంగా టీడీపీ దూసుకెళ్లింది. ఇదిలా ఉండగా.. వెలుగోడు మేజర్‌ పంచాయతీ కావడంతో వార్డు స్థానాలు ఎక్కువగా ఉండటంతో కౌంటింగ్‌ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. తద్వారా సదరు పంచాయతీ ఫలితం నేటితో స్పష్టత రానున్నది. రెండో విడతలో సర్పంచ్‌.. వార్డుల పరంగా సైకిల్‌ జోరు కనిపించడంతో కూటమి వర్గాల్లో ఆనందోత్సవం మొదలైంది. వైసీపీలో నిరుత్సాహం అలుమకుంది.

జిల్లాలో ఓటింగ్‌ పరిస్థితి..

రెండో విడతలో పోలైన ఓటింగ్‌ : 83.47శాతం

అత్యధికం : గడివేముల(87.86)

అత్యల్పం : వెలుగోడు(72.26)

మొత్తం ఓటర్లు : 2,79,254

మొత్తం పోలైన ఓట్లు : 2,33,104

ఇందులో మహిళల ఓట్లు : 1,19,003

ఇందులో పురుషుల ఓట్లు : 1,14,097

పెరిగిన మహిళల ఓటింగ్‌ : 4906 మంది

మొత్తం సర్పంచ్‌ స్థానాలు : 195

టీడీపీ మద్దతుదారులు గెలిచినవి : 137

వైసీపీ మద్దతుదారులు గెలిచినవి : 57

కొనసాగుతున్న కౌంటింగ్‌ స్థానాలు : 01( వెలుగోడు)

రెండో విడత పరిస్థితి ఇలా..

మండలం స్థానాలు ఏకగ్రీవం పోలింగ్‌ టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీ ఇతరులు

సంజామల 17 12 05 15 -- -- 15 02 --

వెలుగోడు 08 03 05 06 -- -- 06 01 --

గడివేమల 16 01 15 11 -- -- 11 05 --

ఆత్మకూరు 17 03 14 11 -- -- 11 06 --

బండిఆత్మకూరు 20 01 19 10 -- -- 10 10 --

అవుకు 21 17 04 12 -- -- 12 09 --

కొలిమిగుండ్ల 23 16 07 18 -- -- 18 05 --

కోవెలకుంట్ల 17 07 10 12 -- -- 12 05 --

బనగానపల్లె 24 12 12 18 -- -- 18 06 --

మహానంది 13 -- 13 07 -- -- 08 06 --

పాణ్యం 19 -- 19 16 -- -- 16 03 --

మొత్తం 195 72 123 137 -- -- 136 58 --

Updated Date - Nov 30 , 2026 | 12:02 AM