Share News

ఐదు జడ్పీటీసీల్లో టీడీపీదే హవా

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:31 AM

జిల్లాలో మండల పరిషత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది.

ఐదు జడ్పీటీసీల్లో టీడీపీదే హవా
ఓర్వకల్లులో గెలుపొందిన జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన పత్రాన్ని అందజేస్తున్న ఎన్నికల అధికారులు

కోడుమూరులో వైసీపీదే విజయం

ఓర్వకల్లు/కల్లూరు/కర్నూలు రూరల్‌/గూడూరు/ సి.బెళగల్‌/ కోడుమూరు నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మండల పరిషత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. ఓర్వకల్లు, కల్లూరు, కర్నూలు, గూడూరు, సి.బెళగల్‌ మండలాల్లోని జడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కోడుమూరులో వైసీపీ విజయం సాధించింది. ఓర్వకల్లు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా బరిలో నిలిచిన జడ్పీటీసీ ఎన్నికల పోరు ఉత్కంఠ భరితం గా సాగి.. చివరకు టీడీపీ విజయంతో ముగిసింది. టీడీపీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి చెట్ల దానమ్మ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెట్ల ప్రశాంతిపై 3,287 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కల్లూరు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా మాధవి విజయం సాధించారు. వైసీపీకి చెందిన ప్రత్యర్థి వాకిటి లక్ష్మమ్మపై 1895 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కర్నూలు మండల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. గార్గేయపురం గ్రామానికి చెందిన జూటూరు శైలజను టీడీపీ తరుపున జడ్పీటీసీ అభ్యర్థిగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చెర్మన్‌ విష్ణువర్దన్‌ రెడ్డి కలసి బరిలోకి దింపారు. వైసీపీ నుంచి పి.రుద్రవరం గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఎంకె మాధవి పోటీ చేశారు. కర్నూలులో శనివారం కౌంటింగ్‌ జరిగిన ఫలితాల్లో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఎంకె.మాధవిపై టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి జూటూరు శైలజ 13,199 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. గూడూరు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా జె. నయోవి 1326 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సి.బెళగల్‌ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా ఎన. జగదీశ్వరరెడ్డి 124 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోడుమూరు జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. జడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా కోట్ల భానుశ్రీ టీడీపీ అభ్యర్థి శారదమ్మపై 638 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు డిక్లరేషన్‌ పత్రాలను అందజేశారు.

Updated Date - Nov 08 , 2026 | 12:31 AM