Share News

తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టీడీపీ

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:36 AM

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అధ్యక్షతన కేక్‌ కట్‌ చేసి, అందరికీ పంచి పెట్టి.. సంబరాలు జరుపుకున్నారు

తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టీడీపీ
ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న మంత్రి టీజీ భరత్‌, జిల్లా అధ్యక్షురాలు గుడిసే క్రిష్ణమ్మ,

పార్టీ కార్యాలయంలో మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అధ్యక్షతన కేక్‌ కట్‌ చేసి, అందరికీ పంచి పెట్టి.. సంబరాలు జరుపుకున్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌ సింగ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌లతో కలిసి అంతక ముందు కలెక్టరేట్‌ ఎదుట ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకుని అక్కడి ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి టీజీ భరత్‌ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయాలను సీఎంచంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ తీసుకెళ్తు.. తెలుగు ప్రజల అత్మగౌరవం కోసం నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. పార్టీ కష్ట కాలంలో కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటూ తిరిగి పార్టీని గెలిపించుకుని నేడు ప్రజలకు భరోసా ఇచ్చే దిశగా అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నారని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్‌ పార్టీ సభ్యులందరికీ ప్రమాద బీమా రూ. ఐదు లక్షల వరకు వర్తింపచేయడం లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాజకీయ కారణాలతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి పిల్లలను ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ ద్వారా విద్యను అందిస్తున్నారని, విపత్కర సమయాల్లో తెలుగుదేశం పార్టీ మెమోరియాల్‌ ట్రస్టు ప్రజలకు తగిన సహాయాన్ని అందించి అదుకుంటుందని అన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్‌ 1982 మార్చి 29న పార్టీని స్థాపించి 1983 ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు నంద్యాల నాగేంద్ర, ధరూర్‌ జేమ్స్‌, మహేష్‌ నాయుడు, పోతురాజు రవికుమార్‌, మహేష్‌ నాయుడు, ముంతాజ్‌, పాలక వీటి విజయకుమార్‌, కార్పొరేటర్‌ కే. పద్మలతారెడ్డి, నాయకులు కేవీ సుబ్బారెడ్డి, అకెపొగు ప్రభాకర్‌, వి. హనుమంతరావు చౌదరి, చంద్రకాంత్‌ , తిరుపాల్‌ బాబు, నంది మదు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:36 AM