హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలం
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:18 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలమైందని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే నెల 2న పదవీ విరమణ కాబోతున్న గడివేముల, పాణ్యం మండలాల సర్పంచ్‌లను గురువారం స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద ఘనంగా సన్మానించారు
వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
పాణ్యం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలమైందని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే నెల 2న పదవీ విరమణ కాబోతున్న గడివేముల, పాణ్యం మండలాల సర్పంచ్‌లను గురువారం స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద ఘనంగా సన్మానించారు. కాటసాని మాట్లాడుతూ వైసీపీ చేసిన పనులు ప్రచారం చేసుకోవడంలో విఫలమైందన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకపోగా ప్రచారం చేసుకోవడంలో పెద్ద ఎత్తున అబద్దాలతో మీడియాను వాడుకుంటుందన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనన్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో ఈప్రాంత బీడు భూములు సస్యశ్యామలమయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌ల బిల్లులను జనవరి నుంచి ఆన్‌లైన్ నిలిపి వేశారని ఆరోపించారు. కార్యక్రమంలో పాణ్యం, గడివేముల ఎంపీపీ, జెడ్పీటీసీలు హుశేన్‌బీ, నారాయణమ్మ, సరళమ్మ, చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు సూర్యనారాయుణ రెడ్డి, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.