‘సర్’లో టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: గౌరు దంపతులు
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:19 PM
సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పిలుపు నిచ్చారు.
పాణ్యం, జూన్ 10(ఆంధ్రజ్యోతి): సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పిలుపు నిచ్చారు. బుధవారం కల్లూరు మండలంలోని దేవి ఫంక్షన్ హాలులో పాణ్యం నియోజకవర్గ స్థాయి టీడీపీ శ్రేణులతో ఎమ్మెల్యే గౌరు చరిత, పాణ్యం పరిశీలకుడు చల్లా లక్ష్మీప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రక్షాలనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఈనెల 15 నుంచి మొదలవుతుందన్నారు. అందులో భాగంగా ఆయా గ్రామ, వార్డు నాయకులు, బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జ్ ఓటర్ల జాబితా పరిశీలనలో పాల్గొనాలని సూచించారు. ఇందులో ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, విద్య, పాస్‌పోర్టు తదితర సర్టిఫికెట్లను పరిశీలిస్తారన్నారు. ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి అర్హత లేని పేర్ల తొలగింపు, కొత్తవారి నమోదు సవరణ చేపడతారని వివరించారు. టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘సర్’ ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జిలు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గౌరు జనార్ధన్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్‌పర్సన్ కె.పార్వతమ్మ, డైరెక్టర్లు శ్రీనివాసరావు, రామగిడ్డయ్య, పీయూ మాదన్న, మండల కన్వీనర్లు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, జి.జయరామిరెడ్డి, పి.దిలీ్‌పరెడ్డి, డి.రామాంజనేయులు, పురుశోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.