Share News

ఎన్నికల వేళ టీడీపీ మరింత బలోపేతం : కోట్ల

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:06 AM

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ టీడీపీ బలపడుతోందని ఎమ్మెల్యే కోట్ల అన్నారు. మంగళవారం ప్యాపిలి మండలం నేరేడుచెర్ల గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు కోట్ల సమక్ష్యంలో పార్టీలో చేరారు

ఎన్నికల వేళ టీడీపీ మరింత బలోపేతం : కోట్ల
పార్టీలో చేరినవారితో ఎమ్మెల్యే కోట్ల

డోన్‌ టౌన్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ టీడీపీ బలపడుతోందని ఎమ్మెల్యే కోట్ల అన్నారు. మంగళవారం ప్యాపిలి మండలం నేరేడుచెర్ల గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు కోట్ల సమక్ష్యంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. లక్కసాగరం లక్ష్మీరెడ్డి,, ఎద్దులదొడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.

హెల్త్‌క్యాంప్‌ ప్రారంభం

ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా హెల్త్‌క్యాం్‌పను ఎమ్మెల్యే కోట్ల ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా సేవా సంకల్ప్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నామన్నారు. సూపరింటెండెంట్‌ డా.హనీఫ్‌, డా.శిల్ప, ఆలంకొండ గిడ్డారెడ్డి, బీజేపీ నాయకులు సంధు వెంకటరమణ, బొంకూరి రవికుమార్‌, దస్తగిరి, వెంకటాపురం రామిరెడ్డి, పవన్‌ రెడ్డి ఉన్నారు.

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

డోన్‌ రూరల్‌: ఆశా వర్కర్లసమస్యలు పరిష్కకరించాలని సీఐటీయూ మండల కార్యదర్శి శివరాం, రామాంజనేయులు, కో కన్వీనర్‌ నాగమద్దయ్య, యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వరమ్మ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కుళ్ళాయమ్మ, భారతి, లక్ష్మీ, రాధిక, కమలమ్మ ఉ న్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:06 AM