పన్నుల పెంపును రద్దు చేయాలి: సీపీఎం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:37 AM
198 జీవో ప్రకారం ప్రతి సంవత్సరం 10 శాతం ఇంటి పన్నుల పెంపును రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు.
కర్నూలు న్యూసిటీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): 198 జీవో ప్రకారం ప్రతి సంవత్సరం 10 శాతం ఇంటి పన్నుల పెంపును రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్‌బీఐ కాలనీలో జరిగిన నగర పాలక కౌన్సిల్ సమావేశంలో ఇంటి పన్నుల పెంపును రద్దు చేయాలని, వ్యాపారులకు పెంచిన ట్రేడ్ లైసెన్సు రద్దు చేస్తూ తీర్మానం చేయాలని సీపీఎం నాయకులు మేయర్ బీవై.రామయ్య, కమిషనర్ పి.విశ్వనాథ్‌కు వినతి పత్రాలు అందజేశారు. గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రజలకు మేలు చేయకపోగా భారాలు వేయడమే పనిగా పెట్టుకుందన్నారు. కనీసము చివర సర్వసభ్య సమవేశంలోనైనా ప్రజలకు మేలు చేయాలని ఆయన కోరారు. కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు పీఎస్.రాధాక్రిష్ణ, నగర కార్యదర్శి రాముడు, రాజశేఖర్ పాల్గొన్నారు.