Share News

టంగుటూరి జీవితం.. ఆదర్శప్రాయం

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:07 AM

ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయమని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ అన్నారు.

టంగుటూరి జీవితం.. ఆదర్శప్రాయం
మాట్లాడుతున్న మాజీ ఎంపీ టీజీ వెంకటేశ

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ

అలరించిన ‘ఆంధ్రకేసరి’ సాహితీ రూపకం

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయమని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘ నంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీ వెంకటే శ హాజరై మాట్లాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు ఒక కులానికి పరిమితమైన మహనీయులు కారని, అన్ని వర్గాల అభ్యున్నతికి వారు పాటుపడ్డారని కొనియాడారు. సీఎం నారా చంద్రబాబు కూడా సీమ అభివృద్ధికి ఎంతో శ్రమిస్తున్నారన్నారు. తొలుత టంగుటూరి చిత్రపటానికి టీజీ వెంకటేశ, కళారత్న పత్తి ఓబులయ్య, కళారత్న కేసీ కల్కూర, జేఎస్‌ఆర్‌కే శర్మలు పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కిరాజు సుందర రామ కృష్ణ బృందం ప్రదర్శించిన ‘ఆంధ్ర కేసరి’ సాహిత్య రూపకం అసాం తం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రకాశ పంతులు తల్లిగా కేవీ సుబ్బ లక్ష్మమ్మ, ప్రకాశం పంతులుగా హరిహర పంత, హనుమంతరావు నాయుడుగా వలివేటి వెంకట శివరామకృష్ణ, పప్పు రామాచార్యులు గా అక్కిరాజు సుందర రామకృష్ణ, నీలం సంజీవరెడ్డిగా ఎం. శారదా ప్రసాద్‌, నీలం సంజీవరెడ్డిగా, కడప కోటిరెడ్డిగా డాక్టర్‌ శివశంకరాచా ర్యులు, బెజవాడ గోపాల్‌రెడ్డిగా పీఎంకే గాంధీ, చిలకమర్తిగా సూర్య నారాయణ మూర్తి, జంధ్యాల పాపయ్యశాసి్త్రగా ఎం. కృష్ణకిషోర్‌, విశ్వనాథ సత్యనారాయణలా హరి శంకరశర్మ నటించి మెప్పించారు. కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాలల స్థాయి విద్యార్థులకు నిర్వ హించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపి కలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అఖిల బారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం ప్రతినిధులు హెచకే మనోహర్‌రావు, హె చకే రాజశేఖర్‌ రావు, సాహితీవేత్తలు డాక్టర్‌ దండెబోయిన పార్వతీ దేవి, లక్ష్మయ్య, మహమ్మద్‌ మియా, డాక్టర్‌ రఘుపతి రెడ్డి, డాక్టర్‌ బుక్కా గంగిరెడ్డి, రంగనాథ్‌, ముచ్చుకోట చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:07 AM