టంగుటూరిని ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:02 AM
బ్రిటీష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బారెడ్డి అన్నారు.
జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): బ్రిటీష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం ప్రకాశం పంతులు 155 జయంతిని పురస్కరించుకుని జడ్పీ మినీ సమావేశభవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారులు జితేంద్ర, తిరుమలేశ్వరరెడ్డి, పుష్పావతి, చిన్న హుస్సేన్, వీరేంద్ర, రాముడు, ఖలీల్, బజారి తదితరులు పాల్గొన్నారు.