Share News

అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:10 PM

సర్పంచ్‌ ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోండి
పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు పరిశీలన

మంత్రాలయం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌ ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రాలయం మండలంలోని అ త్యంత సమస్యాత్మక గ్రామాలైన రచ్చమర్రి, మాధవరంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తును ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ మంత్రాలయం మండలంలో 152 పోలింగ్‌ కేంద్రాల వద్ద 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయా రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించి సర్పంచు ఎన్నికలు సజావుగా జరిగేటట్లు చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీఐలు గిరిబాబు, శ్రీనివాస నాయక్‌, ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:10 PM