Share News

డెంగీ నివారణకుచర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:56 PM

జిల్లాలో 21 డెంగీ కేసులు నమోదయ్యాయని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని మలేరియా స్టేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ టి.రామ్‌నాథరావు ఆదేశించారు.

డెంగీ నివారణకుచర్యలు తీసుకోండి
జిల్లా మలేరియా కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న స్టేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌

జిల్లాలో 21 కేసులు

మలేరియా స్టేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ టి.రామ్‌నాథ్‌ రావు

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 21 డెంగీ కేసులు నమోదయ్యాయని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని మలేరియా స్టేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ టి.రామ్‌నాథరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా మలేరియా శాఖ కార్యాలయంను తనిఖీ చేశారు. డెంగీ, మలేరియా, చికెన్‌ గున్యా, స్ర్కెచ్‌టైపస్‌ కేసులపై ఆయన రివ్యూ చేశారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 5 కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో 16 డెంగీ కేసులు వచ్చాయన్నారు. కల్లూరు పరిధిలోని ముజఫర్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను సందర్శించారు. ఈప్రాంతంలో కూడా ఒకరికి డెంగీ పాజిటివ్‌ వచ్చిందని, అక్కడ ఎలాంటి లార్వా, ఫాగింగ్‌ ఎలా చేశారో పరిశీలించారు. జిల్లా మలేరియా శాఖ అధికారి ఏ.నూక రాజు, డీఎస్‌వో డా.విశ్వేశ్వరరెడ్డి, బయాల జిస్టు వెంకటేశ్వర్లు, ఏపీడమాలజిస్టు వేణుగోపాల్‌, ఏఎంవో, ఎంపీహెచ్‌ఈవో, ఎంపీహెచ్‌ఎస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:56 PM