Share News

వివేకానంద ఆశయాలు స్ఫూర్తిగా తీసుకోండి

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:59 PM

స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత చైతన్యవంతులు కావాలని సెట్కూరు సీఈవో డాక్టర్‌ వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు.

వివేకానంద ఆశయాలు స్ఫూర్తిగా తీసుకోండి

సెట్కూరు సీఈవో డాక్టర్‌ వేణుగోపాల్‌

కర్నూలు స్పోర్ట్స్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత చైతన్యవంతులు కావాలని సెట్కూరు సీఈవో డాక్టర్‌ వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్కూరు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా మేధా, ప్రతిభా పోటీలు సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ దేశ పురోగతికి యువత కీలకమన్నారు. అలాంటి యువత చెడుబాట పట్టకుండా సన్మార్గంలో పయనించాలన్నారు. డీఎస్పీ మహబూబ్‌ బాషా మాట్లాడుతూ యువత డ్రగ్స్‌, ఆల్కహాల్‌, పొగాకు, గుట్కా వంటి చెడు అలవాట్లకు బానిసలు కాకూడదన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి విజ్ఞానం సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, జిల్లా టూరిజం అధికారి లక్ష్మినారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, కళాశాల కన్వీనర్‌ శ్రావణి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:59 PM