Share News

సస్యరక్షణ చర్యలు చేపట్టండి

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:48 PM

మామిడి తోటలపై సోకిన తెగుళ్లపై రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యాన అధికారి అధికారి రాజాకృష్ణారెడ్డి సూచించారు.

సస్యరక్షణ చర్యలు చేపట్టండి
మామిడి తోటలను పరిశీలిస్తున్న జిల్లా ఉద్యాన శాఖాధికారి

జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి

ఓర్వకల్లు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మామిడి తోటలపై సోకిన తెగుళ్లపై రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యాన అధికారి అధికారి రాజాకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని ఉ య్యాలవాడలో ఉన్న మామిడి తోటలను సందర్శించారు. ఈ ఏడాది పూత బాగా వచ్చినప్పటికీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడిపై తేనేమంచు, తామర పురుగు ఆశించడంతో పూత రాలుతుందన్నారు. పిందే గోలి సైజు ఉన్నప్పుడు ఫ్రూట్‌ కవర్లు కట్టుకుంటే చీడపీడలు ముఖ్యంగా పండుఈగ, మంగు ఆశించకుండా ఉంటుందని, కాయ కూడా నాణ్యత కలిగి మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుందని వివరించారు. ఉద్యాన శాఖ ద్వారా మామిడి ఫ్రూట్‌ కవర్లు 50శాతం రాయితీతో అందిస్తారన్నారు. కార్యక్రమంలో ఉధ్యాన అధికారిణి అనూష, సహాయకులు అనిత, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:48 PM