ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:17 AM
ప్రజలంతా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి అన్నారు.
కర్నూలు లీగల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రజలంతా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి అన్నారు. మంగళవారం స్థానిక వెంకటరమణ కాలనీలో లయన్స క్లబ్ ఆధ్వర్యంలో రాషీ్ట్రయ స్వయం సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా లీలా వెంకట శేషాద్రి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్లు జయప్ర కాష్, రంగనాథ్, యుగంధర్, ప్రమోద్ కుమార్, చిల్డ్రన్స స్పెషలిస్టు డా.రమేష్, లయన్స క్లబ్ సభ్యులు గోపినాథ్, శంకరప్ప, రాజేశ్వరరెడ్డి, మంజునాథ్, సత్యనారాయణ పాల్గొన్నారు.