Share News

విమానాశ్రయంలో తగిన చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:17 PM

విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

విమానాశ్రయంలో తగిన చర్యలు తీసుకోండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.సిరి

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ డా.ఏ. సిరి

ఓర్వకల్లు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో కలెక్టర్‌ అధ్యక్షతన ఎయిర్‌ఫీల్డ్‌ ఎన్విరాన్మెంట్‌ మేనేజ్మెంట్‌ కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు సమీపంలో నిర్ణయించిన 20 కిలోమీటర్ల పరిధిలోపు ఎత్తయిన భవనాలు, విండ్‌ వీల్స్‌, ఎలక్ర్టికల్‌ పోల్స్‌ ఏర్పాటు చేయకుండా పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకో వాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అందుకు తగ్గట్లు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్ల్లేందుకు లోపలికి రావడానికి రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు. చుట్టుపక్కల గ్రామస్తులు పశువుల కళేబరాలు పడేయ కుండా అవగాహన కల్పించాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ విద్యాసా గర్‌ను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఉన్న నాలుగు పరిశ్రమలు, మైనింగ్‌లలో దుమ్ము, పొగ రాకుండా ఎప్పటికప్పుడు వారికి ఆదేశాలు జారీ చేస్తూ ఉండాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కిషోర్‌ రెడ్డిని కలెక్టర్‌ ఆదేశించారు. క్రాస్‌ ఫైర్‌ టెండర్స్‌ రాకపోకలకు గాను మూడెకరాల పొలాన్ని గుర్తించి మార్చి 31లోపు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌, డీఆర్వో వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కిషోర్‌ రెడ్డి, డీఎంహెచ్‌వో భాస్కర్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, డీఈ సుబ్బన్న, ఫారెస్టు రేంజర్‌ ఓబులేసు, ఇండిగో మేనేజర్‌ ఖాజా మొహిద్దీన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏడీఎం శ్రీనివాసులు, స్టేషన్‌ మేనేజర్‌ నాగరాజు పాల్గొన్నారు.

ఈక్రాప్‌ నమోదులో లోపాలు తగదు

రైతులు పంటలకు భద్రత కల్పించే ఈక్రాప్‌ నమోదు ప్రక్రి యలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డా.ఏ .సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని రైతుల పంట పొలాల్లో సాగు చేసిన వరి పంట ఈక్రాప్‌ నమోదును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పంటల బీమా ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, రుణమాఫీ, నష్టపరిహారం వంటి ప్రయోజనాలు రైతులకు అందాలంటే ఈక్రాప్‌ డేటా ఖచ్చితంగా నమోదు కావడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ఏవో మధుమతి పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 11:17 PM