Share News

‘ఎల్‌హెచ్‌ఎంఎస్‌’ను సద్వినియోగించుకోండి

ABN , Publish Date - May 14 , 2026 | 11:05 PM

పట్టణంలో దొంగతనాల నివారణ, ప్రజల ఆస్తుల భద్రత కల్పించేందుకు లాక్డ్‌ హౌస్‌ మానిట రింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) అనే వినూత్న కార్యక్రమాన్ని అందుబా టులోకి తెస్తున్నట్లు ఏఎస్పీ ఎం.జావళి అల్ఫోన్స్‌ పేర్కొన్నారు.

‘ఎల్‌హెచ్‌ఎంఎస్‌’ను సద్వినియోగించుకోండి
మాట్లాడుతున్న ఏఎస్పీ జావళి

ఏఎస్పీ జావళి

నంద్యాల క్రైమ్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో దొంగతనాల నివారణ, ప్రజల ఆస్తుల భద్రత కల్పించేందుకు లాక్డ్‌ హౌస్‌ మానిట రింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) అనే వినూత్న కార్యక్రమాన్ని అందుబా టులోకి తెస్తున్నట్లు ఏఎస్పీ ఎం.జావళి అల్ఫోన్స్‌ పేర్కొన్నారు. స్థానిక పోలీసు సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి నంద్యాల సబ్‌ డివిజన్‌లో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను అందుబాటులోకి రానుందని ఆమె ప్రకటించారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే సమయంలో దొంగతనాలకు ఏమాత్రం అవకాశం లేకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను ప్రజలు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని తమ వివరాలను నమోదు చేసు కోవాలన్నారు. ప్రజలు ఇళ్లు వదిలి ఊర్లకు వెళ్లే సమయంలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇంటికి తాళం వేసి ఉంటుందో యాప్‌ ద్వారా వాచ్‌ రిక్వెస్ట్‌ పంపాలన్నారు. ప్రజల రిక్వెస్ట్‌ అందిన వెంటనే పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నుంచి సిబ్బంది సంప్రదించి వారి ఇళ్ల వద్ద ఉచితంగా అధునాతన సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేస్తారని, ఈ కెమెరాలు మోషన్‌ డిటెక్షన్‌ సెన్సార్లతో పనిచేస్తాయని చెప్పారు. ఇంటి వద్ద ఏ చిన్న అలజడి జరిగినా వెంటనే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు అలర్ట్‌ వెలుతుం దని, తద్వారా పోలీసులు తక్షణమే స్పందించి దొంగతనాన్ని అరికడ తారన్నారు. యాప్‌ అందుబాటులో లేని వారు పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వాట్సాప్‌ నంబరు 9154877890కు సమాచారం ఇవ్వవచ్చని, మనమిత్ర వాట్సాప్‌ 9552300009కు రిక్వెస్ట్‌ పంపవచ్చని చెప్పారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో కెమెరాలున్నాయని, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఊర్లకు వెళ్లే సమయంలో వి ువైన నగలు, నగదును ఇంట్లో ఉంచుకోకుండా నమ్మకస్తుల వద్ద లేదా బ్యాంకు లాకర్లలో ఉంచుకోవాలన్నారు. నంద్యాల పట్టణ, శివారు ప్రాంతాల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Updated Date - May 14 , 2026 | 11:05 PM