ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:48 AM
పాడిపరిశ్రమ అబివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
పత్తికొండ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పాడిపరిశ్రమ అబివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు. మండగిరి గ్రామంలో గురువారం మార్కెట్‌శాఖ సౌజన్యంతో పశుసంవర్థకశాఖ నిర్వహిస్తున్న ఉచిచ పశువైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మార్కెట్‌యార్డు చైర్మన్ ఆలంకొండ నబి, కార్యదర్శి కార్నలీస్, పశుసంవర్థకశాఖ వైద్యులు లక్ష్మన్న, స్వర్ణతల, కిషోర్, టిడిపి నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, వెంకటపతి, లోక్‌నాథ్ తదితరులు ఉన్నారు.
వెల్దుర్తి: రామళ్లకోట, లక్ష్ముంపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పర్యటించారు. రామళ్లకోట గ్రామంలో కొట్టం రామానాయుడు కరెంటు షాక్‌తో మృతిచెందగా.. రూ.5 లక్షల ప్రమాదబీమా ఆయన భార్య పద్మావతికి అందజేశారు. లక్ష్ముంపల్లె గ్రామంలో బోయ రామాంజనేయులు పాముకాటుతో మరణించగా ఆయన భార్య జ్యోతికి ప్రమాదబీమా పరిహారం రూ.5లక్షల చెక్కు అందజేశారు. నాయకులు సుబ్బారాయుడు, జ్ఞానేశ్వర్‌గౌడు, రామకృష్ణాచారి, రాజు పాల్గొన్నారు.
క్రిష్ణగిరి: ఆగవేళి అంగన్‌వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆలంకొండ, పోతుగల్లు, ఎర్రబాడు, ఎస్.హెచ్ ఎర్రగుడి, క్రిష్ణగిరి, టి.గోకులపాడు గ్రామాలలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరార్శించారు. పత్తికొండ మార్కెట్‌యార్డ్ చైర్మన్ ఆలంకొండ నబీ సాహెభ్, టీడీపీ అదక్షుడు మండల దామోదర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి గురుస్వామి, సోమలింగన్న గౌడ్, సజ్జద్ అహమ్మద్, జయరాముడు పాల్గొన్నారు.