Share News

టైలర్లు వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:14 AM

ప్రస్తుతం రెడీమేడ్‌ వస్త్ర ప్రపంచంలో టైలర్లు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని రాజ్యసభ సభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు నగర లేడీస్‌ అండ్‌ జెంట్స్‌ టైలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓసీఎం రంగా ఆధ్వర్యంలో జాతీయ టైలర్స్‌ డే నిర్వహించారు

టైలర్లు వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి
మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ను సన్మానిస్తున్న టైలర్స్‌ నాయకులు

కర్నూలు కల్చరల్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రెడీమేడ్‌ వస్త్ర ప్రపంచంలో టైలర్లు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని రాజ్యసభ సభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు నగర లేడీస్‌ అండ్‌ జెంట్స్‌ టైలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓసీఎం రంగా ఆధ్వర్యంలో జాతీయ టైలర్స్‌ డే నిర్వహించారు. ఈ వేడుకలకు టీజీ వెంకటేశ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కుట్టు మిషన్‌ను కనిపెట్టిన ఇలియాస్‌ హో చిత్రపటానికి టీజీ వెంకటేశ్‌ నివాళి అర్పించి, కేక్‌ కట్‌చేశారు. అనంతరం మాట్లాడుతూ టైలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అసోసియేషన్‌ అఽధ్యక్షుడు ఓసీఎం రంగా టైలర్స్‌ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ అసోసియేషన్‌కు ఆయన సహకారాలు అందించాలని కోరారు.

ఉమ్మడి జిల్లా కమిటీ..

ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు సిటీ లేడీస్‌ అండ్‌ జెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఓసీఎం రంగా ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. సభ్యులు అమర్నాథ్‌ రెడ్డి, బాబూ యాదవ్‌, వేణుగోపాల్‌, బాలసాయి నరసింహులు, రామకృష్ణ, బాలరాజు, శ్రీశ్రీ రామకృష్ణ, షేక్‌ షావలి, ఉదయ్‌శంకర్‌, శేఖర్‌ చక్రవర్తి, సలాం, సాగర్‌, రసూల్‌, ఇమ్మసా, మహాబ్‌ బాషా, లక్ష్మన్న, శాంతిరాజు, లక్ష్మీకాంతరెడ్డి, అశోక్‌ యాదవ్‌, శ్రీరాములు, వెంకటేశ్వర్లు యాదవ్‌ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. లక్కీ డిప్‌ నిర్వహించి డ్రాలో గెలుపొందిన మురళి, వెంకటేశ్వర్లు, వెంకటకృష్ణకు విలువైన కుట్టుమిషన్లు అందజేశారు.

Updated Date - Mar 02 , 2026 | 12:14 AM