Share News

మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:13 PM

మధ్యవర్తిత్వ చట్టం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందించవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది తెలిపారు.

మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది

కర్నూలు లీగల్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వ చట్టం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందించవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది తెలిపారు. స్థానిక జిల్లా కోర్టులో శనివారం మధ్యవర్తిత్వ చట్టం-2023, న్యాయ సేవల ప్రాధికార చట్టం-1987 అనే అంశంపై జరిగిన ఒక వర్క్‌షాపులో ఆయన ప్రససంగించారు. దీర్ఘకాలికంగా వి విధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్క రించేందుకు ఈ చట్టాలు ఉపయోగపడుతాయని తెలిపారు. అనంతరం విశ్రాంత జిల్లా న్యాయాధికారి పల్లె మోహన్‌రావు, విశ్రాంత సహాయ సంచాలకులు ఎన్‌.జేసు రత్నకుమార్‌ ఈ చట్టాలపై న్యాయాధికారులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్‌షాపులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని న్యాయాధికారులందరూ పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి పి.కమలాదేవి, నంద్యాల జిల్లా మూడో న్యాయాధికారి డి.అమ్మన రాజు, కర్నూలు ప్యామిలీ కోర్టు న్యాయాధికారి టి.లీలావతి, కర్నూలు ఫోక్సో కోర్టు న్యాయాధికారి రాజేంద్రబాబు, ఏసీబీ కోర్టు న్యాయాధికారి శ్రీవిద్య, కర్నూలు సీబీఐ కోర్టు న్యాయాధికారి ఎం.శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:13 PM