Share News

లోక్‌ అదాలత్‌లో సత్వర న్యాయం

ABN , Publish Date - Jul 11 , 2026 | 10:47 PM

చిన్నచిన్న సమస్యలకు కోర్టులను ఆశ్రయించకుండా లోక్‌ అదాలత్‌ను ఆశ్రయిస్తే సమయం, డబ్బు ఆదా అవుతాయని, రాజీ మార్గంలో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజ, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శిరీష్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శ్రీనివాసులు, ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ లక్ష్మి, స్పెషల్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఏసురత్నం పేర్కొన్నారు.

లోక్‌ అదాలత్‌లో సత్వర న్యాయం
చెక్కును అందజేస్తున్న దృశ్యం

1,351 కేసులు పరిష్కారం

నంద్యాల క్రైం, జులై 11 (ఆంధ్రజ్యోతి): చిన్నచిన్న సమస్యలకు కోర్టులను ఆశ్రయించకుండా లోక్‌ అదాలత్‌ను ఆశ్రయిస్తే సమయం, డబ్బు ఆదా అవుతాయని, రాజీ మార్గంలో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజ, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శిరీష్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శ్రీనివాసులు, ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ లక్ష్మి, స్పెషల్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఏసురత్నం పేర్కొన్నారు. రాజీ కాగల కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు అధికారులు కృషి చే శారని అన్నారు. నేడు లోక్‌ అదాలత్‌లో అత్యధికంగా 1,351 కేసులు పరిష్కరించినట్లు వారు తెలిపారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. లోక్‌ అదాలత్‌లో 63 క్యాలెండర్‌ కేసులు, రెండు క్రిమినల్‌, రెండు ఎక్సైజ్‌, ఎస్టీసీ 1042, సివిల్‌ 46, ప్రమాద కేసులు 98, పీఎల్‌సీ 55 కేసులు పరిష్కరించారు. ఈ. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జీవీఎన్‌ ప్రసాద్‌, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్‌, వివేకానందరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, కృష్ణలింగమయ్య, లోక్‌ అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 10:47 PM