Share News

బాధితులకు సత్వర న్యాయం

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:48 PM

వచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూస్తా మని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ వెల్లడించారు.

బాధితులకు సత్వర న్యాయం
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పీజీఆర్‌ఎస్‌లో 119 ఫిర్యాదులు

కర్నూలు క్రైం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): వచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూస్తా మని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ వెల్లడించారు. సోమవారం కొత్తపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఇదిలా ఉండగా సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుసేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, మస్తాన్‌వలి పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:48 PM