స్వీపర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:28 AM
కరోనా సమయం లో తొలగించిన ఆర్టీసీ స్వీపర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు నగేష్ డిమాండ్ చేశారు.
సీఐటీయూ నగర అధ్యక్షుడు నగేష్
కర్నూలు న్యూసిటీ, జూలై 13(ఆంధ్రజ్యోతి): కరోనా సమయం లో తొలగించిన ఆర్టీసీ స్వీపర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు నగేష్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ స్వీపర్స్ యూనియన నాయకులు దేవరాజు అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నగేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండులో కాంట్రాక్టు స్వీపర్లుగా గత 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్న 9 మంది కార్మికులను కరోనా సమయంలో తొలగించడం బాఽధాకర మన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపాధి కోల్పోయిన స్వీపర్లు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కర్నూలు ఎంపి నాగరాజు, ఆర్టీసీ రీజినల్ చైర్మన పూల నాగరాజు తొలగించిన స్వీపర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించినా ఇప్పటి వరకు తీసుకోలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు మద్దిలేటి, నారాయణ, రమేష్, దేవేంద్రరాజు, శాంతి, రేణుకమ్మ, మేరీ, జ్యోతి పాల్గొన్నారు.