స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్రే లక్ష్యం
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:45 AM
స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం ఓర్వకల్లులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటి ప్రజలు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న ఆరోగ్యసేవలు, వస తులపై ప్రతి రూముకు వెళ్లి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరు చరితారెడ్డి మాట్లా డుతూ శుభ్రతపై ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగ అనుసూయ, తహసీల్దార్ విద్యాసాగర్, ఏవో మధుమతి, ఎంఈవో ఓంకార్ యాదవ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఇంజనీర్ సురేంద్రనాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఎంపీడీవో శాంతయ్య, సొసైటీ అధ్యక్షుడు సీఎన సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, ఇనచార్జి మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత, టీడీపీ మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, నాయకులు విశ్వేశ్వరరెడ్డి, మోహన రెడ్డి, చంద్రపెద్దస్వామి, లక్ష్మీకాంత రెడ్డి, కొమరోలు భాస్కర్ రెడ్డి, సంజీవ, వైద్యులు పాల్గొన్నారు.
జీరో-వ్యర్థాల జీవనశైలిని అలవర్చుకోవాలి: కలెక్టర్
కర్నూలు కలెక్టరేట్: ప్రతి ఒక్కరూ జీరో-వ్యర్థాల జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ‘జీరో లిట్టర్ గవర్నెన్స’ అనే థీమ్‌తో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛా ంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. తొలుత కలెక్టరేట్ నుంచి అధికా రులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం స్వచ్ఛాం ధ్ర ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ‘జీరో లిట్టర్ గవర్నెన్స’ అనే థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 40 నుంచి 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. డీపీవో భాస్కర్, కలెక్టరేట్ ఏవో శివరాముడు పాల్గొన్నారు.
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్: స్వచ్ఛాంధ్ర నిర్వహణ, స్వర్ణాంధ్ర సాధన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ అన్నారు. శనివారం కార్యాలయ ఆవ రణ స్వచ్ఛాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా కార్యాలయ పరిసరాలను శుభ్రపరిచారు. అశోక్ కుమార్ మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పరిసరాల శుభ్రతను పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉప సంచాలకులు జవహర్ బాబు, ఐపీవో డానియేలు, ఫయాజ్ పాల్గొన్నారు.
గూడూరు: గ్రామాల్లో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని టీడీపీ మండల అధ్యక్షుడు జె సురేష్ అన్నారు. శనివారం గూడూరులోని మండల పరిషత కార్యాలయం ఆవ రణలో స్వచ్ఛ రథాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు జె సురేష్, ఎంపీడీవో కృష్ణమోహనశర్మలు ప్రారంభించారు.క ార్యక్రమంలో ఈవోఆర్డీ మధు లత, మండల పరిషత సిబ్బంది పాల్గొన్నారు.