Share News

జగన్‌ బాటలో ఎస్వీ, సిద్ధార్థ

ABN , Publish Date - May 14 , 2026 | 11:09 PM

జగన్‌ బాటలో ఎస్వీ, సిద్ధార్థ

జగన్‌ బాటలో ఎస్వీ, సిద్ధార్థ
కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ నాయకుల నిరసన

శాంతి భద్రతలను దెబ్బతీయడానికి కుట్రలు

టీజీ భరత్‌కు కక్ష సాధింపు అపాదించడం తగదు

కుడా చైర్మన్‌ సొమిశెట్టి వెంకటేశ్వర్లు

కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన

కర్నూలు అర్బన్‌, మే 14(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ బాటలో వైసీపీ నాయకులు ఎస్వీ మెహన్‌ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రయాణిస్తూ ప్రశాంతంగా ఉన్న కర్నూ లు నగరంలో కుట్రలు పన్నుతున్నారని కుడా చైర్మన్‌ సొమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఎదుట తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి నగరాజుయాదవ్‌, నగర అధ్యక్షుడు కొర కంచి రవి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించి వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనం తరం సోమిశెట్టి మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్‌ కర్నూలు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నార నీ, ఏ రోజూ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడలేదని, అలాంటి వ్యక్తిపై వైసీపీ నాయ కులు ఆరోపణలు చేయడం తగదని అన్నారు. గతంలో అధికార మదంతో వైసీపీ నాయకులు చేసిన త ప్పులకు నేడు పోలీసులు చర్యలు తీసుకుంటుంటే ఆ పాపాన్ని టీజీ భరత్‌కు అంటగట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ అఽధినేత జగన్మోహన్‌రెడ్డి మార్గంలో ఈ నాయకులు ప్రయానిస్తూ కుట్ర రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలు గుదేశం ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్‌, కార్పొరేటర్‌ కురువ పరమేశ్‌, టూరిజం శాఖ డైరెక్టర్‌ ముంతాజ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కైపా పద్మలతారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్‌ పాల్గొన్నారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కమెడియన్‌

టీజీ కుటుంబానికి రాజకీయాల్లో మచ్చలేదు

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, మే 14(ఆంధ్రజ్యోతి): బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్టాండప్‌ కమెడియన్‌ అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ ఎద్దేవా చేశారు. గురువారం అమరావతిలోని మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్ధాయిలో మండి పడ్డారు. దశాబ్దాలుగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, రాజకీయాల్లో టీజీ కుటుంబం అంటే మచ్చలేనిదని అన్నారు. తన తండ్రి టీజీ వెంకటేష్‌ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి నిజాయితీగా ప్రజాసేవలో ఉన్నారని, రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే బాటలో నడిచారన్నారు. ఆయన్ను చూసి తాను కూడా ప్రజాసేవలోకి వచ్చినట్లు తెలిపారు. ఏదో రాజకీయం చేయాలన్న కారణంతో సిద్ధార్థరెడ్డి కర్నూలులో తన గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు. కోట్ల రూపాయలు దోచుకున్నావంటూ తనపై బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్‌ కేసు వేయబోతున్నట్లు తెలిపారు. నిజాయితీ పరుడైన టీజీ భరత్‌ విషయంలో ఎందుకు మాట్లాడానా? అని సిద్ధార్థ రెడ్డి తప్పకుండా ఆలోచించే రోజు వస్తుందన్నారు.

Updated Date - May 14 , 2026 | 11:09 PM