Share News

మరబోట్లు నిలిపివేత

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:41 PM

తెలంగాణ రాష్ట్రంలోని సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్లే మరబోట్లను కొత్తపల్లి పోలీసులు శనివారం నుంచి నిలిపివేశారు.

మరబోట్లు నిలిపివేత
సంగమేశ్వరం వద్ద కృష్ణానది వద్ద నిలిచిపోయిన మరబోట్లు

లైసెన్సులు లేవంటున్న పోలీసులు

ఇబ్బందులు పడుతున్న సంగమేశ్వరం భక్తులు

కొత్తపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్లే మరబోట్లను కొత్తపల్లి పోలీసులు శనివారం నుంచి నిలిపివేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల ద్వారా సోమశిల నుంచి కృష్ణానదిలో మరబోట్ల ద్వారా సంగమేశ్వరం దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపల్లి మండలంలోని వివిధ గ్రా మాల నుంచి వందల కుటుంబాల వారు తెలంగాణ రాష్ట్రంలో వందల కుటుంబాల వారికి బంధుత్వాలు కూడా ఉన్నాయి. సంగమేశ్వరం నుంచి సోమశిలకు కూడా అక్కడ మరబోట్ల నిర్వాహకులు రానీయడం లేదు. ఇలా ఇరు రాష్ట్రాల వారు నదిలో మరబోట్లను నిలుపుదల చేయడంతో సంగమేశ్వరం వచ్చే భక్తులతో పాటు కొత్తపల్లి నుంచి తెలంగాణ వెళ్లే ప్రజలు సైతం ఇబ్బందులు తప్పడంలేదు. వీటిపై జిల్లా అధికారులు స్పందించకపోతే ఆంరఽధా, తెలంగాణ మరబోట్ల నిర్వాహకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై కొత్తపల్లి ఎస్‌ఐ జయశేఖర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా సోమశిల మరబోట్ల నిర్వాహకులకు లైసెన్సు లేకపోవడంతోనే నిలిపివేశామన్నారు. ఇదిలా ఉండగా సంగమేశ్వరం నుంచి సోమశిలకు తిప్పే మరబోట్లను నిలుపుదల చేయలేదని, వారంతకు వారే మరబోట్లను తిప్పడం లేదని చెప్పడం గమనార్హం.

Updated Date - Jul 26 , 2026 | 11:42 PM