ఏడీపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:25 PM
ఏడీపై సస్పెన్షన్ వేటు
ఉత్తర్వులు జారీ చేసిన చేనేత, జౌళి శాఖ కమిషనర్
చేనేత గుర్తింపు కార్డుల జారీలో అవకతవకలు
రాజకీయ నాయకుల సిఫార్సులున్న వారికే జారీ
వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
ఓ మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడని ఆరోపణలు
ఏడీగా అదనపు బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి
కర్నూలు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ నాగరాజురావుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆశాఖ కమిషనర్ రేఖా రాణి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో చేనేత, జౌళి శాఖ తిరుపతి జోనల్ ఆఫీ్‌సలో పనిచేస్తున్న ఏడీ శ్రీనివాసరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. సస్పెన్షన్‌కు గురైన ఏడీ నాగరాజురావు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కర్నూలు ప్రధాన కార్యాల యంలో అందుబాటులో ఉండాలని, తన అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వివిధ కేటగిరిల వారికి మంజూరు కోసం అర్హులైన లబ్ధిదారుల నుంచి ఈనెల 6 నుంచి 18వ తేది వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు (ఎస్‌జీఎ్‌సడబ్ల్యూ) కార్యాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నారు.
అర్హత ఉండి కూడా పింఛన్‌కు..
చేనేత, జౌళి శాఖ అధికారులు ఎమ్మిగనూరు, కోడు మూరు ప్రాంతాల్లో రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చిన ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఈనెల 14న విచారణ పేరుతో హడావుడి చేశారు. రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికి మాత్రమే ‘చేనేత కార్మికుని ధ్రువ పత్రాలు’ జారీ చేశారు. ఆపత్రం ఉంటే తప్పా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేయలేమని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు తేల్చి చెప్పారు. అర్హత ఉండి కూడా చేనేత పింఛన్‌కు దరఖాస్తు చేయలేని పరిస్థితిని కల్పించడమే కాకుండా ఉమ్మడి జిల్లాలో నేతన్నల్లో గందరగోళ పరిస్థితి సృష్టించారు. చేనేత కార్డుల జారీలో అవకతవకలకు జారిగానే ఆరో పణులు వెల్లువెత్తాయి.
చేనేత సామాజికవర్గంలో..
చేనేత సామాజికవర్గంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవిషయాన్ని ‘పింఛన్ దరఖాస్తుల్లో గందగోళం’ అనే శీర్షికన ఈనెల 19న ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. అదే కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని ఉద్దేశ్య పూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఏడీ నాగరాజురావుపై కమిషనర్ రేఖారాణికి ఫిర్యాదు చేశారు. ఆమెకు అనవసరమైన అడ్డంకులు సృష్టిస్తున్నారని అందులో పేర్కొన్నారు. వీటితో పాటు పలు ఆరోపణలు కూడా రావడంతో ఏడీని క్రమశిక్షణ చర్యలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సస్పెన్షన్‌లో ఉంచుతున్నట్లు కమిషనర్ రేఖారాణి ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
తిరుపతి జోనల్ ఆఫీ్‌సలో పనిచేస్తున్న..
చేనేత, జౌళి శాఖ ఏడీ నాగరాజురావుపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఆయ న స్థానంలో ఆ శాఖ తిరుపతి జోనల్ ఆఫీ్‌సలో పని చేస్తున్న ఏడీ, శ్రీసత్యసా యి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసరు పి.శ్రీనివాసరెడ్డికి పూర్తి అదనపు బాధ్యత(ఎ్‌ఫఏసీ)లు అప్పగించారు. రాష్ట్ర కమిషనర్ రేఖారాణి నుంచి ఆదేశాలు రాగానే తిరుపతి నుంచి బయలుదేరిన ఆయన సోమవారం సాయంత్రం కర్నూలు ఏడీగా బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ ఏ.సిరిని గౌరవ పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏడీ పి.శ్రీనివాసరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ అర్హులైన చేనేత కార్మికులందరికీ ఎన్టీఆర్ భరోసా పథకం చేనేత పింఛన్లు అందేలా బాధ్యతగా పనిచేస్తానన్నారు.