మంత్రాలయంవైస్ ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:06 PM
మంత్రాలయం ఎంపీపీగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి సతీమణి యశోదమ్మ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.
మొదటిసారి దళితులకు దక్కిన వైస్ ఎంపీపీ
సభ్యుల మద్దతు లేక పదవి కోల్పోయిన జనసేన
ఆర్భాటంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం
మంత్రాలయం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం ఎంపీపీగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి సతీమణి యశోదమ్మ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రివేరా ఇన్ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక అధికారి బాలవర్ధిని రాజు, ఎంపీడీవో నూర్జహాన్, తహసీల్దారు రమాదేవి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మంత్రాలయం మండలంలో 18 ఎంటీసీలు గాను వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. టీడీపీకి చెందిన 10 మంది, జనసేనకు చెందిన ఒక్కరు సభకు హాజరయ్యారు. గురువారం జరగాల్సిన ప్రమాణ స్వీకారం వాయిదా పడిన విషయం తెలిసిందే. వైౖస్ ఎంపీపీగా నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి లక్ష్మన్న కో డలు సులోచను ఖాయమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే టీడీ పీ ఎంపీటీసీలు మద్దతు తెలుపకపోవడంతో తృటిలో ఆ పదవిని జనసేన కోల్పోయింది. నాటకీయ పరిణామాల మధ్య మ ధ్యాహ్నం 3గంటలకు రచ్చమర్రి గ్రామానికి చెందిన ఎంపీటీసీ-2 కే బాలరాజుకు 10 మంది ఎంపీటీసీల మద్దతు తెలపడంతో దళిత సామాజిక వర్గానికి చెందిన బాలరాజుకు వైస్ ఎంపీపీ పదవి వరించింది. వీరితో పాటు ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సభా వే దిక వద్ద మంత్రాలయం సీఐ గిరిబాబు, ఎస్‌ఐ మల్లికార్జునల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
మంత్రాలయం మండల చరిత్రలో దళితులకు దక్కిన వైస్ ఎంపీపీ పీఠం
మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు దళితులకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పీఠం దక్కలేదు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి, మంచాల సింగిల్ విండో అధ్యక్షుడు రామకృష్ణరెడ్డి, మాజీ సర్పంచు రఘునాథరెడ్డి, రాకే్‌షరెడ్డి, రాజారెడ్డి దళితులకు వైస్ ఎంపీపీ ఇవ్వాలన్న ఉద్దేశంతో రచ్చమర్రికి చెందిన ఎంపీటీసీ-2 గా ఎన్నికైన సాధారణ బాలరాజు అనే యువకునికి వైస్ ఎంపీపీ పదవిని ఇచ్చారు. గత 42 ఏళ్లుగా మండల వ్యవస్థలో దళితులకు ఇలాంటి పీఠం ఎవ్వరికీ దక్కలేదు.