Share News

భూ ఆక్రమణలపై సర్వే

ABN , Publish Date - Mar 10 , 2026 | 01:04 AM

పట్టణంలో భూ ఆక్రమణలపై అధికారులు ఎట్టకేలకు కదిలారు. పట్టణ శివారులోని సర్వేనంబర్‌ 113/1, 114/2లో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హంద్రీనీవా పిల్ల కాలువను తవ్వేసి ఆక్రమించాడు.

భూ ఆక్రమణలపై సర్వే
కాలువ తవ్వుతున్న దృశ్యం

కదిలిన యంత్రాంగం

పూడ్చిన పిల్ల కాల్వను తవ్వించిన అధికారులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

పత్తికొండ టౌన్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో భూ ఆక్రమణలపై అధికారులు ఎట్టకేలకు కదిలారు. పట్టణ శివారులోని సర్వేనంబర్‌ 113/1, 114/2లో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హంద్రీనీవా పిల్ల కాలువను తవ్వేసి ఆక్రమించాడు. ఈనెల 7న ’కాలువను కాజేసి’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన రెవెన్యూ, సర్వేయర్‌ అధికారులు సోమవారం భూకబ్జాకు పాల్పడిన స్థలానికి చేరుకుని సమగ్రంగా సర్వే చేపట్టారు. హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్‌ అధికారులు కూడా ఆక్రమణకు గురైన పిల్ల కాలువ వద్దకు చేరుకుని పరిశీలించారు. రైతుల కోసం ఏర్పాటుచేసిన కాలువను ఎలా పూడుస్తావని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల హెచ్చరి కలతో ఆవ్యాపారి ఇటాచీని తెప్పించి పూడ్చిన కాలువను తవ్వాడు. ఆర్‌ఐ శ్రీనివాసరావు, మండల సర్వేయర్‌ గాదిలింగప్ప మాట్లాడుతూ హంద్రీనీవా పిల్ల కాలువను తవ్వేసి నామ రూపాలు లేకుండా చేయడం వాస్తవమేనన్నారు. సర్వేనంబర్‌ 118 వంక పోరంబోకు స్థలంలో అధికారుల అనుమతి లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ బ్రిడ్జిని కూడా తొలగించమని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని ఆదేశించామన్నారు. సమగ్రంగా నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. అక్రమంగా కట్టిన బ్రిడ్జిని తొలగిస్తారా లేదానన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, సర్వేయర్‌ అధికారులు సమగ్రంగా సర్వే జరిపి అక్రమ కట్టడాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 01:04 AM