Share News

బియ్యం నిల్వలపై నిఘా

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:22 PM

జిల్లాలో బియ్యం నిల్వలపై నిరంతరం నిఘా ఉంటుందని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ వ్యాపారులకు సూచించారు.

బియ్యం నిల్వలపై నిఘా
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బియ్యం నిల్వలపై నిరంతరం నిఘా ఉంటుందని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ వ్యాపారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం నిల్వలు, ధరల నియంత్రణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోందన్నారు. రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు, ట్రేడర్లు, రిటైలర్లు, తమ నిల్వల వివరాలను ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఫుడ్‌ స్టాక్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

Updated Date - Nov 21 , 2026 | 11:22 PM