Share News

పారదర్శకంగా సర్‌ ప్రక్రియ పూర్తి

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:54 PM

సర్‌ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపరిమితిలో పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

పారదర్శకంగా సర్‌ ప్రక్రియ పూర్తి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, డీఆర్వో

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : సర్‌ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపరిమితిలో పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సర్‌ సవరించిన షెడ్యూల్‌, విచారణలు పూర్తయ్యి తుది నిర్ణయం కోసం పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఫారం- 6,7,8 స్వీకరణ-పరిష్కారం, బీఎల్‌వో స్టేట్‌సకు సంబంధించిన కాల్‌బుక్‌, ఎన్‌జీఎ్‌సపీ ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. సవరించిన సర్‌ షెడ్యూల్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇప్పటికే వివరించడంతో పాటు, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రెస్‌నోట్‌ ద్వారా విస్తృత ప్రచారం కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. సర్‌ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ కార్యక్రమం 85 శాతం పూర్తయిందని, మిగిలినది ఈ వారంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఫారం 6,7,8 లకు సంబంధించి సుమారు 14,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బీఎ ల్వో స్టేట్‌సకు సంబంధించిన కాల్‌బుక్‌లో 12 అంశాలు, ఎన్‌జీఎ్‌సపీలో 2 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. డీఆర్వో రామునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2026 | 11:54 PM