Share News

టీడీపీని గెలిపించండి

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:07 AM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రం కైప-సంకలాపురం గ్రామాల మధ్య రూ.1.80 కోట్టతో నిర్మించిన సీసీ రోడ్లు, వంతెన నిర్మాణ పనులను, అలాగే కైప గ్రామంలో రూ.1.20 కొట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు

టీడీపీని గెలిపించండి
కైప- సంకలాపురం సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి

ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

బనగానపల్లె, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రం కైప-సంకలాపురం గ్రామాల మధ్య రూ.1.80 కోట్టతో నిర్మించిన సీసీ రోడ్లు, వంతెన నిర్మాణ పనులను, అలాగే కైప గ్రామంలో రూ.1.20 కొట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. కైప గ్రామం నుంచి సంకలాపురం వంతెన వరకు కాలినడకన వెళ్లి పనులు పరిశీలించారు. మంత్రికి కైప గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు పీవీ.కుమార్‌రెడ్డి, కైప రఘునాథరెడ్డి, సంకలాపురం సుదర్శన్‌రెడ్డి, శివారెడ్డి స్వాగతం పలికారు. కైప గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని రెండేళ్లలో టీడీపీ అందించిన సంక్షేమ పథకాలను గురించి వివరించి కరపత్రికలను పంపిణీ చేశారు. కైప గ్రామంలో మాట్లాడుతూ కుగ్రామమైన సంకలాపురం గ్రామ ప్రజల కలలు నెరవేర్చామన్నారు. మోకాళ్లలోతు గుంతలు ఉండడంతో కైప, సంకలాపురం గ్రామ ప్రజలు ఇబ్బందులు పడేవారిని రహదారిని పూర్తి చేశామన్నారు. కైప చెరువు అభివృద్దికి రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కైపలో సీసీ రోడ్డు వేస్తుంటే ఓర్వలేక ట్రాక్టర్లతో సీసీ రోడ్డును తొక్కించిన దుర్మార్గులు వైసీపీ నాయకులు అన్నారు. చిత్తుచిత్తుగా ఓడినా గొడ్డలిపార్టీ వారిలో మార్పురాలేదన్నారు. అభివృద్దిపై చర్చకు రావాలని మరో సారి మంత్రి మాజీ ఎమ్మెల్యే కాటసానికి సవాల్‌ విసిరారు. కైప, సంకలాపురం గ్రామ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారన్నారు. స్ర్తీశక్తిపథకం, తల్లికివందనం, పింఛన్లు, దీపం పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ ప్రకటించి 16వేల మదికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. గతంలో ఎన్నికల్లో ఓడినా మినరల్‌వాటర్‌ అందించామని, అభివృద్ది చేసే పార్టీలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. సంకలాపురం నుంచి నందవరం గ్రామానికి బీటీరోడ్డు వేయాలని టీడీపీ నాయకులు మంత్రి బీసీకి విజ్ఞప్తి చేశారు. పీవీ.కుమార్‌రెడ్డి, కైప రఘునాథరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, అక్బర్‌బాషా, సంకలాపురం సుదర్శన్‌రెడ్డి,. శివారెడ్డి, శంకర్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. సీఐ మంజునాథరెడ్డి, నందివర్గం ఎస్‌ఐ భూపాలుడు పోలీస్‌ బందోబస్తును నిర్వహించారు.

Updated Date - Aug 04 , 2026 | 01:07 AM