వ్యవసాయాభివృద్ధికి టీడీపీ పెద్దపీటట
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:09 AM
వ్యవసాయాభివృద్దికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం యు.కొత్తపల్లి గ్రామంలో ఏడీఏ సునీత, ఏవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీకోసంలో భాగంగా ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ (పీడీఎంఎస్) నిర్వహించారు.
డోన్ టౌన్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాభివృద్దికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం యు.కొత్తపల్లి గ్రామంలో ఏడీఏ సునీత, ఏవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీకోసంలో భాగంగా ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ (పీడీఎంఎస్) నిర్వహించారు. సాగుకు ముందే పీడీఎంఎస్ విత్తనాలు వేసి, మొకలు వచ్చాక కలియదున్నితే భూసారం పెఇరగి, దిగుబడి వస్తుదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు తప్పవని ఎమ్మెల్యే కోరారు.
క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రోడ్లు, నీటి సరఫరా, పించన్లు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వలసల రామకృష్ణ, సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్, కొత్తకోట శ్రీను, యు.కొత్తపల్లి రంజిత్ కిరణ్, మిద్దెపల్లి గోవిందు, గోసానిపల్లి తాడూరు రమణయ్య, శ్రీనివాసులు ఆచారి, ఏడీఏ సునీత, ఏవో శ్రీనివాసరెడ్డి, డా.నాగరాజు, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, హార్టికల్చర్ కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.