పేదలకు నాణ్యమైన ఆహారం అందించండి
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:15 AM
అన్న క్యాంటీన్లను మరింత మెరుగుపరిచి పేదలకు నాణ్యమైన ఆహారం అందించడంపై దృష్టి సారించాలని అన్న క్యాంటీన్ల చారిట బుల్ ట్రస్ట్ సీఈవో వంశీధర్ అన్నారు.
అన్న క్యాంటీన్ల చారిటబుల్ ట్రస్ట్ సీఈవో వంశీధర్
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): అన్న క్యాంటీన్లను మరింత మెరుగుపరిచి పేదలకు నాణ్యమైన ఆహారం అందించడంపై దృష్టి సారించాలని అన్న క్యాంటీన్ల చారిట బుల్ ట్రస్ట్ సీఈవో వంశీధర్ అన్నారు. బుధవారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని కార్పొరేషన్ సమావేశ భవనంలో అన్నక్యాంటీన్ల స్థాయీ సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మున్సిపాలిటీల కమిషనర్లతో పాటు నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. కమిటీల ఏర్పాటు అన్న క్యాంటీన్ల విస్తరణ, సేవలు మెరుగుదలపై చర్చలు జరిపారు. ఆయన మాట్లాడుతూ పేదలకు మూడు పూటల భోజనం అందించే అన్న క్యాంటీన్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి మూడు పూటలకు రూ.75 వరకు ఖర్చు చేస్తూ కేవలం రూ.15లకే ఆహారం అందించడం గొప్ప కార్యక్రమమన్నారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ రుచికరంగా వంటలు చేయ డంతో పాటు పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలన్నారు. సమావేశంలో సలహా మండలి సభ్యులు పలు సూచనలు చేసి సేవల మెరుగుదలకు సహకరించాలని కోరారు. ్గన్నారు.