పారిశుధ్య పనులపై పర్యవేక్షించండి
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:12 AM
పారిశుధ్య పనులపై పర్యవేక్షణ ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సిబ్బందిని ఆదేశించారు.
కార్పొరేషన కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పారిశుధ్య పనులపై పర్యవేక్షణ ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ధర్మపేట, కొత్తపేట, కేసీ కెనాల్ వినాయకఘాట్, తుంగభద్ర నది ఒడ్డున ఉన్న సంకల్‌బాగ్, సాయిబాబా గేరి ప్రాంతాల్లోని పుష్కరఘాట్‌లలో పారి శుధ్య పనులను ఆయన తనిఖీ చేశారు. కొత్తపేటలో పారిశుధ్య కార్మి కురాలు శుభ్రం చేసిన చెత్తను డస్ట్ బినలో వేయకుండా కింద పార వేయడం, దగ్గర్లో వాణిజ్య దుకాణాల ఎదుట చెత్తాచెదారం పేరుకు పోవడం, అలాగే సమీపంలోని పుట్‌పాతపై చెత్తాచెదారం ఉండటం పై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పారిశుధ్య నిర్వహణ, సిబ్బంది పనితీరును నిత్యం సమీక్షిస్తూ పర్యవేక్షకులు పనిచేయాలన్నారు. వాణిజ్య దుకాణాల దారుల షాపు ఎదుట చెత్తాచెదారం ఉంచితే జరిమానా విధించాలని ఆదేశించారు. శానిటరీ ఇనస్పెక్టర్లు ఫరూక్, మల్లికార్జున ఉన్నారు.