Share News

సూపర్‌ సిక్స్‌ను సక్సెస్‌ చేశాం

ABN , Publish Date - May 02 , 2026 | 12:21 AM

సీఎం చంద్రబాబు సూపర్‌సిక్స్‌ పథకాలను సూపర్‌ సక్సెస్‌ చేశారని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి నుంచి ఈద్గానగర్‌ వరకు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.

సూపర్‌ సిక్స్‌ను సక్సెస్‌ చేశాం
బనగానపల్లెలో పింఛన్లు ఇస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌రెడి

బనగానపల్లె, మే 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు సూపర్‌సిక్స్‌ పథకాలను సూపర్‌ సక్సెస్‌ చేశారని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి నుంచి ఈద్గానగర్‌ వరకు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. పింఛన్‌దారుల యోగక్షేమాలను అడిగి పెన్షన్లు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.4వేల ప్రకారం మొత్తం రూ.2,725 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీవో నాగరాజు, సచివాలయ ఎంపీడీవో తిరుమలేశ్వర్‌రెడ్డి, డీఈ నాగశ్రీనివాసులు, ఏఈ సాయికృష్ణ, వీఆర్‌వో ఈశ్వర్‌రెడ్డి, టీడీపీ నాయకులు బురానుద్దీన్‌, ఇస్మాయిల్‌ఖాన్‌, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీ భవనాన్ని పూర్తిచేస్తాం

గ్రామ పంచాయతీ భవనాన్ని త్వరిత గతిన పూర్తిచేసి పట్టణ ప్రజలకు అంకితమిస్తామని రోడ్లు మంత్రి బీసీ అన్నారు. రూ.1.90 కోట్లతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి శుక్రవారం భూమిపూజ చేశారు. ప్రజలు, ఉద్యోగులు మంచి వాతావరణంలో పనిచేసేలా అత్యాధునిక వసతులతో నవాబుల కాలంలో ఉండే భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రింగ్‌రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. సుమారు రూ.40 కోట్లకు పైగా వ్యయంతో సీసీ రోడ్లు, అండర్‌డ్రైనేజీ పనులు, వాకింగ్‌ ట్రాక్‌ పనులు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణం నలువైపులా 4లైన్ల నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పీఆర్‌ డీఈ నాగశ్రీనివాసులు, టీడీపీ నాయకులు బురానుద్దీన్‌, టంగుటూరు శ్రీనయ్య, సలాం, హైదర్‌, ఇస్మాయిల్‌ఖాన్‌, గౌండాబాబు, పాల్గొన్నారు.

అనంతరం పట్టణంలో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించారు.

Updated Date - May 02 , 2026 | 12:21 AM